Home రాష్ట్ర వార్తలు కానిస్టేబుల్స్ దారుఢ్య పరీక్షలు

కానిస్టేబుల్స్ దారుఢ్య పరీక్షలు

TS-Police-Logo15 నుంచి ఆగస్టు 6 వరకు, కమ్యూనికేషన్స్‌లో 29 నుంచి 4 వరకు

మన తెలంగాణ/హైదరాబాద్: కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో మరో ఘట్టానికి నియామక బోర్డు తెరలేపింది. సివిల్, ఎఆర్, ఎస్‌ఎఆర్, టిఎస్‌ఎస్‌పి, ఎస్‌పి ఎఫ్, ఫైర్‌మెన్ విభాగాల్లో ఇప్పటి వరకు రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఆరోగ్య పరీక్షలు, వేలి ముద్రలు, ఆధార్ వెరిఫికేషన్ తదితర  వాటిల్లో అర్హత పొందిన 1,92,588 మందికి ఈ నెల 15 నుంచి ఆగస్టు 6 వ తేదీ వరకు, కమ్యూనికేషన్ విభాగంలో అర్హత పొందిన 27,410 మందికి జూలై 29 నుంచి ఆగస్టు 4 వ తేదీ వరకు శరీర దారుఢ్యం, సామర్థ పరీక్షలను నిర్వహించనున్నామని ప్రకటించారు. హాల్ టికెట్ల వారిగా ఎవరు ఎక్కడ హాజరవాలనే విషయాలను వ్యక్తిగతంగా తెలియజేయడం జరిగిందని,అవసరమైనవారు వెబ్‌సైట్‌లోనూ చూడవచ్చని నియామకబోర్డు  ఛైర్మన్ జె. పూర్ణచందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు.