Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

సోషల్ మీడియా నిండా.. రూ.2వేల నోటే..!

2000-Noteకొత్త వస్తువు తమ వద్దకు రాగానే పది మందికి చూపించుకోవడం అందరికి అలవాటే.. కొత్త వస్తువు చేతి అందగానే దాన్ని అందరికి చూపించుకొని మురిసిపోతుంటారు. అయితే ఇప్పుడు ఏ కొత్త వస్తువు కొన్న ప్రతీ ఒక్కరు ఫోటో దిగి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసేస్తున్నారు. వస్తువులే కాదు.. ఏది కొత్తది వచ్చిన అది ఆ రోజు సోషల్ మీడియాను ఆక్రమించేస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితి రెండు వేల నోటుకు ఏర్పడింది. 500, 1000 రూపాయిలు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం గురువారం నుంచి రూ.2వేల నోట్లు ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే రూ.2000 నోటు అందుకున్న ప్రతి ఒక్కరు దాంతో ఓ ఫోటో దిగి ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాద్యమాల్లో అప్‌లోడ్ చేస్తున్నారు. సామన్యలు మాత్రమే కాదు… సెలబ్రిటీలు కూడా.. కొత్త రెండు వేల రూపాయిల నోటుతో ఫోటోలు దిగేసి, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. దీంతో ఏ సైట్ చూసిన కొత్త రెండు వేల రూపాయిల నోటే దర్శనమిస్తుంది. కొత్త నోటు అందుకున్న వాళ్లు అనందంగా ఉన్నా.. పాత నోట్ల మార్పు జరిగని వాళ్లు మాత్రం ఇబ్బందులు ఎదురుకుంటూనే ఉన్నారు. ఆఖరికి ఛాయ్ తాగాలంటే కూడా డబ్బులు లేక ఇక్కట్లు పడుతున్నామని వాళ్లు కూడా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఏదేమైనప్పటికి పాత నోట్ల రద్దు, కొత్త నోట్ల రంగ ప్రవేశం సోషల్ మీడియాను మాత్రం ఓ ఊపు ఊపేస్తుంది…..

Comments

comments