Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డి తప్పనిసరి

 Every house is built with toilet booths in Villages

మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి : స్వచ్ఛ్‌భారత్ మిషన్ (గ్రామీణ్)  కింద ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించుకుని జిల్లాను స్వచ్ఛజిల్లాగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు కోరారు. మంగళవారం కోహీర్ మండల కొత్తూర్. డి గ్రామంలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద నిర్మించిన మరుగుదొడ్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోగా ఒకే ఒక గృహస్థుడు మరుగుదొడ్డి కట్టుకోలేకపోవడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ సంబంధితుల ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణాన్ని స్వయం గా ఇటుకలతో కట్టి ప్రారంభించారు. గ్రామానికి చెందిన స్వరూప భర్త నర్సింలు ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవడంతో గ్రామంలో వందశాతం నిర్మాణాలు పూర్తికాలేదని, వారి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణంలో గ్రామంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. వెంటనే మరుగుదొడ్డి నిర్మాణం పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. స్వచ్చ్ భారత్ మిషన్ కింద ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్నారు. మహిళల ఆత్మాభిమానాన్ని కాపాడటానికి, ఆరోగ్యవంతమైన సమాజం కోసం అందరూ భాగస్వాములు కావాలన్నారు. కలెక్టర్ వెంట డిపీవో వెంకటేశ్వర్లు, ఆర్టీవో హమీద్, తహాశీల్దార్, ఎంపిడివో, గ్రామ సర్పంచ్ సువర్ణ ఉన్నారు.

Comments

comments