Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ఉద్యమంగా హరితహరం

Every plant planted should be protected

నాటిన ప్రతి మొక్కను రక్షించాలి
జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన వెల్లడి

మనతెలంగాణ/జ్యోతినగర్: ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టి రాబోయేతరానికి స్వచ్ఛమైన గాలి,ప్రకృతిని అందించాలంటే ఇంటింటా ఉద్యమ ంలాగా మొక్కలు నాటి వాటిని రక్షించుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. బుధవారం ఎన్టీపీసీ రామగుండం అంబేద్కర్ కమ్యూనిటీ సెంటర్‌లో నాలుగవ విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్దపల్లి జిల్లా స్థాయి అటవీ శాఖ, వ్యవసాయశాఖ, ఎంపిడిఒలతో పాటు జిల్లాకు చెందిన పలు విభాగాల అధికారులు, గ్రామ సర్పంచ్‌లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ అడవుల నరికివేత,వాహనకాలుష్యం, ప్లాస్టిక్ వినియోగంతో పాటు బొగ్గు బాయి బొందలతో ప్రకృతి విధ్వం సం అవుతుందని అన్నారు.ఇలాగే కొనసాగితే రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి ఇవ్వలేకపోతామని,రామగుండం లాంటి పట్టణంలో ఇప్పటికే 47డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ఇదే విధంగా ఉంటే రాబోయే కాలంలో వాతావరణ కాలుష్యం పెరిగిపో యి మరింత నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. మన పిల్లలకు కనీసం స్వచ్ఛమైన గాలి ఇవ్వాలని, వారికి ఇవ్వాల్సింది ఆస్తులు కాదని, ప్రకృతిని అందించాలని,ఇందుకోసం ప్రతి ఇంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమం లాగా చేపట్టాలని ఆమె సూచించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పర్యావరణానికి పెను ముప్పువాటిల్లిందని, తెలంగాణ ప్రభుత్వం ఎక్కడాలేని విధంగా హరితహారం కార్యక్రమం చేపట్టి విజయవంతంగా కొనసాగిస్తుందని అన్నారు.కానీ పెట్టిన మొక్కలను రక్షించుకోకుంటే వృథా అవుతుందని అన్నారు. ప్రతి అధికారి,గ్రామ సర్పంచ్,ప్రజలు బాధ్యతతో చేపడితే హ రితహారం కార్యక్రమం విజయవంతం అవుతుందని అన్నారు. ప్రకృతితో మమేకమై చేసే హరితహారంలో అందరు భా గస్వాము లు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ల క్ష మొక్కలను పెంచే బాధ్యతను చేపట్టాలని ఆమె అన్నారు. అటవీశాఖకు చెందిన భూములతో పాటు ప్రభుత్వ స్థలాల్లో సీడ్‌బా ల్ ద్వా రా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.
ఇందుకోసం జిల్లాలో 26లక్షల మొక్కలను నాటాలని ఆమె అన్నారు.జీవా అమృతం ద్వారా మొక్కలు పెంచే విధానాన్ని అటవీ శా ఖ సిబ్బంది ద్వారా సమావేశంలో పాల్గొన్న సిబ్బందికి, సర్ప ంచ్‌లకు వివరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొ న్న డిసిపి సుదర్శన్‌గౌడ్ మాట్లాడుతూ అటవీశాఖ భూ ములను అక్రమాలకు గురికాకుండా చేపట్టాలని,ఎక్కడా అటవీశాఖ భూమి అక్రమానికి గురైన సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి గ్రామంలో మొక్క లు నాటేందుకు పోలీసులు కూడా తమవంతు బాధ్యత తీసుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వ నజాదేవి,డిఆర్‌డిఒపద్మయ్యతో పాటు అటవీ శాఖ డి ఎఫ్‌ఒ రవి ప్రసాద్, రేంజ్ అధికారి జగదీశ్వర్‌లతో పాటు రహ్మత్ ఉల్లా, ప ద్మ, మౌ నిక తదితరులు పాల్గొన్నారు.

Comments

comments