Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

0888 888888.. ఈ నంబర్ నుంచి ఫోన్ వచ్చిందో… మీ పని అయిపోయినట్టే

0888-888888

బల్గేరియా: ఈ నంబర్ 0888 888 888 తీసుకున్నవాళ్లంతా ఒకరు తరువాత ఒకరు చనిపోతున్నారు. నంబర్ తీసుకుంటే చనిపోవడమేంటి అని అనుమానం రావచ్చు మీకు. కానీ ఇప్పటికే ఈ ఫ్యాన్సీ నంబర్ తీసుకున్న నలుగురు వినియోగదారులు చనిపోయారు. దీంతో ఈ నంబర్‌ను మొబిటెల్ అనే సంస్థ బ్యాన్ చేసింది. ఫస్ట్ ఈ నంబర్‌ను మొబిటెల్ సిఇఒ వ్లాదిమర్ వాడాడట. కొన్ని రోజులు తరువాత వ్లాదిమర్ క్యాన్సర్‌తో మరణించాడు. ఆదే నంబర్‌ను డిమిట్రోవ్ అనే మాఫియా డాన్ ఉపయోగిస్తున్నప్పుడు దుండగుడి చేతిలో హతమయ్యాడు. తరువాత ఈ నంబర్ దీష్‌లీవ్ అనే వ్యాపార వేత్త తీసుకున్నాడు. నంబర్ తీసుకున్న ఆరు నెలలోపు దీష్‌లీవ్ హత్యకు గురయ్యాడు. ఈ నంబర్ తీసుకున్న కస్టమర్లు అందరూ చనిపోతుండటంతో ఈ నంబర్‌ను ఏ వినియోగదారునికి కంపెనీ ఇవ్వడం లేదు. వినియోగదారులు ఈ నంబర్‌పై ఎన్నో సార్లు ఫిర్యాదులు చేసిన మొబిటెల్ సంస్థ పట్టించుకోవడమే కాకుండా నంబర్‌పై ఉన్న రహస్యాన్ని బయటకు చెప్పడం లేదు.

Comments

comments