Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ప్రతి ఏటా ఓ చికాగో నగరాన్ని నిర్మించాలి

2030 నాటికి 60 కోట్ల మంది పట్టణాల్లో నివాసం: కేంద్ర మంత్రి 

 UNO

ఐక్యరాజ్య సమితి : భారతదేశంలో నగర డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటి నుంచి 2030 వరకు ప్రతి సంవత్సరం  దేశంలో  ఓ చికాగో నగరాన్ని నిర్మించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఐక్యరాజ్యసమితి ఉన్నతస్థాయి రాజకీయ ఫోరంలో సుస్థిర అభివృద్ధి అనే అంశంపై ఆయన  మాట్లాడారు.  భారత్‌లో అభివృద్ధి లక్ష్యాలను అందుకోవడంలో మానవ హక్కులను కూడా దృష్టిలో పెట్టుకుంటామని  ఆయన తెలిపారు.

2009 నుంచి 2013 వరకు ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత ప్రతినిధిగా పనిచేసిన పూరి, 2030 నాటికి 60 కోట్ల మంది భారతీయులు పట్టణ ప్రాంతవాసులుగా ఉంటారని ఆయన అంచనా వేశారు. ఈ లక్షం ఐక్యరాజ్యసమితి నిర్దేశించినదేనని ఆయన గుర్తు చేశారు. భారత్ ప్రతి ఏటా 70 కోట్ల నుంచి 90 కోట్ల చదరపు మీటర్ల పట్టణ నిర్మాణం జరపాల్సి ఉంటుందని ఆయన  చెప్పారు. మరోమాటలో చెప్పాలంటే కొత్త చికాగో నగరాన్ని భారత్ ప్రతి ఏటా నిర్మించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. యుఎన్ ఫోరం నిర్వహించిన ఈ  సమావేశంలో  దౌత్యవేత్తలు, ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారులు, పౌర సమాజానికి చెందిన ప్రతినిధులు, పట్టణ నిర్మాణ నిపుణులు, జాతీయస్థాయి వాటాదారులు  పాల్గొన్నారు.

Comments

comments