Home జిల్లాలు ఈత..కారాదు కడుపు కోత

ఈత..కారాదు కడుపు కోత

swimming

మన తెలంగాణ / కోడేరు : వేసవి సెలవులు.. ఎండవేడిమితో ఉక్కపోత… ఇం కేం ఎక్కడైనా బావుల్లో, చెరువుల్లో, కాల్వల్లో ఈతల కు వెళ్లి సేదతీరుతుంటారు. ఈతల వల్ల శారీరక దారుడ్యం పెరుగుతుంది. ఈ మాటేలా ఉన్నా ఈత నేర్చు కొవాలనే చాలా మంది పిల్లలు ఉత్సాహం చూపుతుంటారు. అజాగ్రత్తల వల్ల విలువైన ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. ఇ లాంటి విషాద ఘటనలు తలెత్తకుండా ఉండాలంటే చిన్నపాటి జాగ్రత్తలు తీసు కొవడం మంచిది. ఈతలకు వెళ్లే సంధర్భంల్లో తల్లిదండ్రులు బాధ్యతను తీసుకొ ని వెంట వెళ్లి ఈతలను నేర్పించడం మంచిది. ఎండ వేడిమి తంటుకొలేక చిన్న పెద్ద తేడా లేకుం డా అందరు వేసవిలో ఈతలకు వెళ్లి సేదతీరుతుంటారు. ఇలా వెళ్లి గతంలో కోడేరు మండలంలోని సింగాయిపల్లి గ్రామ పంచా యితి పరిదిలో పాఠశాల విద్యార్థులు కుంటలో నీళ్లల్లో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృ త్యువాత పడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న కోండ్రావుపల్లి గ్రామంలో ఉమా మహేశ్వరి అనే అమ్మాయి ఈతకు వెళ్లి మృత్యువాత పడింది. ఇలాంటి సంఘ టల వల్ల తల్లిందడ్రులకు గర్భశోకం మిగులుతుంది. ఇలాంటి సంఘటనలు పునఃరావృత్తం కాకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు అవసరం.
ఇవీ జాగ్రత్తలు:బావుల్లో, కాలువల్లో, చెరువుల్లో ఈతలకు వెళ్లేప్పుడు తప్పనిస రిగా పెద్దలను వెంట పెట్టుకు పోవాలి. ప్రస్తుతం కేఎల్‌ఐ ద్వారా మండలంలో సాగునీరు రావడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో పాడుబడ్డ బావుల్లో సైతం నీరుంది. ఈతలకు వెళ్లేప్పుడు బావులపై అవగాహన ఉన్నవారితో కలిసి వెళ్లడం మంచిది. కాలువలు తవ్వేప్పుడు రాళ్లను పేల్చి ఉంటారు దీంతో ఈతల కు వెళ్లేప్పుడు కాలుల్లో ప్రమాదాలు జరిగే వీలుంది. అజాగ్రత్తగా ఉంటే ప్రాణాల కే ప్రమాదం. ఈతలకు వెళ్లేప్పుడు ప్రత్యేక దుస్తులు దరించాలి. దీంతో ప్రమాదా లు జరిగే అవకాశాలు తక్కువ.అలాగే శిక్షణ ఉన్న లేక నైపుణ్యం గల వ్యక్తుల పర్యవేక్షణలోనే ఈతలకు వెళ్లాలి. ఈతలకు వెళ్లే వాళ్లు ఈ మద్య కాలంలో వాట ర్ క్యాన్‌లను గాని, వాటర్ బాటీళ్లను గాని బెండుగా వాడుతున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలే ఎక్కువ.
తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి: ఈతలకు వచ్చే చిన్నారులు ఒంటరిగా కాకుండా తల్లిదండ్రులతో కలిసి రావడం మంచిది. వీరి పర్యవేక్షణలోనే ఈతలు నేర్చుకొవాలి. విష జ్వరాలు, జలుబు, చర్మవాదులున్న వారు ఈతలకు దూరం గా ఉండడమే మంచిది. ఈత కొలనులో ఎక్కువ మందితో కలిసి ఈతలు నేర్చు కొవడం కాని లేక ఈతలకు వెళ్లకపోవడమే మంచిది. ఈ సమయంలో ఒకరిపై ఒకరు దూకడం,దాగుడుమూతలు, చిలిపి చేష్టలవల్ల ఏదైనా ప్రమాదం జరగవ చ్చు. ఆ సమయాల్లో తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా గమనించాలి. కాలువ ల్లో నిలువ ఉన్న నీళ్లల్లో ఈత పడకపోవడంమే మంచిది. మూర్చవ్యాది ఉన్నవారు ఈతలకు వెళ్లకపోవడమే మంచిది.
జాగ్రత్తలు అవసరం
ప్రతి వ్యక్తి ఈత నేర్చుకొవాలన్న సరదా ఉంటుంది. శిక్షకులు, నిపుణులు లేకుండా ఈతలు రాని వారు ఈతలకు వెళ్లవద్దు. తల్లిదండ్రులు పర్యవేక్షణ తప్ప ని సరి. అది వారి భాద్యత. అజాగ్రత్తగా ఉంటే ప్ర మాదాలు జరుగవచ్చు. జాగ్రత్త లు పాటించకుం డా పిల్లలను ఈతలకు పంపించవద్దని తల్లిదండ్రు లకు హెచ్చరి స్తున్నాం.
ఎస్‌ఐ షేక్‌షఫీ, కోడేరు
ఈతలతో సంపూర్ణ ఆరోగ్యం
ఈత ప్రతి ఒక్కరికి తప్పనిసరి. విద్యార్థి దశలోనే నేర్చుకోవాలి. రోజు ఒక గంట పాటు ఈత కొడితే ఆరోగ్యంతో పాటు శారీరానికి మంచి వ్యాయమం లభిస్తుంది. అయితే ఈతలకు వెళ్లేప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. శిక్షణ కలిగిన వ్యక్తుల పర్యవేక్షణలోనే ఈతలు నేర్చుకొవాలి. తల్లిదండ్రులు పర్యవేక్షణలో ఈతలు నేర్పడం మంచిది. రక్తపోటు, మదుమేహం, శ్వాస, కీళ్ల నోప్పులున్న వాళ్లు డాక్టర్ సలహలతో మాత్రమే ఈతలకు వెళ్లాలి.
డాక్టర్ రాజశేఖర్