Search
Wednesday 21 November 2018
  • :
  • :

హరితహారం విజయవంతానికి ప్రతి ఒక్కరి కృషి అవశ్యం

Everybody's hard work for the success of greenery

మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి

మన తెలంగాణ/ఘట్‌కేసర్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమా న్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి అన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఘట్‌కేసర్ పరిధిలోని మేధా కాలనీలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి హాజరై మొక్కలను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. జిల్లాలో ఉండాల్సిన అటవీ సంపద లేదని, ఇలానే కొనసాగితే భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. తమ పిల్లలకు చదువు, ఆస్తులను అందించడంతో పా టు వారు జీవించగలిగే ప్రకృతిని కూడా అందించాల్సిన అవసరం ఉందని, లేనిపక్షంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు. పార్కు స్థలాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాలు, రోడ్లకు ఇరువైపుల, స్మశానవాటికలు తదితర స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఈ సందర్భంగా మొక్కలను నాటే విధానాన్ని కలెక్టర్ కులంకశం గా వివరించారు. మొక్కలు ఇష్టానుసారం పెడితే బ్రతికే అవకాశం ఉండదని, సరైన పద్దతిలో నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బండారి శ్రీనివాస్‌గౌడ్, జడ్‌పిటిసి మంద సంజీవరెడ్డి, ఘట్‌కేసర్ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్, ఎంఆర్‌ఓ పద్మప్రియ, ఎంపిడిఓ యెళ్ల అరు ణ, ఆర్‌ఐ వెంకటేష్, మేధా కంపెనీ ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Comments

comments