హరిత నాగర్కర్నూల్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ : శ్రీధర్
మన తెలంగాణ/నాగర్కర్నూల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన నాలుగవ విడత హరిత హారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై హరిత నాగర్కర్నూల్ ఏర్పాటుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంపై బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. హరితహారం కార్యక్రమానికి పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. జూలై రెండ వ వారం నుండి హరితహారం కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉన్నందున జిల్లా అధికారులు ఇందుకు సంభందించిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. 15 రోజుల పాటు ఉద్యమంలా సాగే కార్యక్రమంలో పూర్తి స్థాయిలో మొక్కలు నాటి, వాటిని సంరక్షించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆయా శాఖల వారిగా నిర్దేశించిన ప్రకారం ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతి శాఖ నుండి హరితహారం కార్యక్రమానికై నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు. నర్సరీల వారిగా పూర్తి వివరాలతో బుక్లెట్ను తయారు చేయడం జరిగిందని, ఆబుక్లెట్లను ప్రజా ప్రథినిధులకు, ప్రజ.లకు అందజేయనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో జేసీ సురేందర్ కరన్, డీఆర్ఓ మధుసూదన్నాయక్, డీఆర్డీఓ సుదాకర్, ఆర్డీఓ శ్రీనువాసులు, సీపీఓ జగన్నాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.