Home జాతీయ వార్తలు అందరి బాగే భారతీయత

అందరి బాగే భారతీయత

pmఉజ్జయిని: ‘సర్వే జనా సుఖినోభవంతు’ సంవి ధానం భారతీయ సంస్కృతిలోనే ఇమిడి ఉంద ని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. మధ్య ప్రదేశ్‌లో జరుగుతున్న సింహస్థ కుంభమేళాకు హాజరు అయిన ప్రధాని మోడీ శనివారం భార తీయ విలువల గురించి విశ్లేషించారు. కుంభ మేళా నేపథ్యంలోనే ఏర్పాటైన సింహస్థ విశ్వజ నీన సందేశం అంతర్జాతీయ సదస్సులో శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేనతో పా టు మోడీ హాజరయ్యారు. తరాలుగా భారతీయ సంప్రదాయాలకు విలువలు ఉన్నాయని, చివరికి ఓ యాచకుడు కూడా తనకు భిక్షం వేసే వారు, వేయని వారు కూడా సుభిక్షంగా ఉండాలని ఎలు గెత్తి చాటుతారని మోడీ చెప్పారు. ఆత్మ పరిశీలన కీలకం అని, మనం ఏమిటనేది తరచిచూసుకో వడం వల్ల మంచికి దారితీస్తుందని, ఇది విశ్వ మానవాళికి క్షేమదాయకం అవుతుందని తెలి పారు. తమను తాము అధికులం అనుకో వడం, తమను మించిన వారు లేరనుకోవడం చివరికి ఘర్షణలకు దారితీస్తోందని పేర్కొ న్నారు. అందరి కన్నా గొప్పవారం అనుకునే ముందు ఓసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రాచీనకాలంలో సముద్రా లను దాటడం అపవిత్రం అనుకునేవారని, మహాపాపంగా భావించేవారని, అయితే ఈ పరిస్థితి కాలానుగుణంగా మారిందని తెలి పారు. కాలంధాటికి కొన్ని సాంప్రదాయాలు కూడా మారుతూ ఉంటాయని, అయితే నిలిచి ఉం డేవి అందరికీ ఉపయుక్తం అవుతాయని విశ్లేషిం చారు. ఎన్నికల రంగం గురించి తీసుకుంటే, భారతీయ ఎన్నికలు ప్రపంచంలోనే ఓ అద్భుతం అని, ఇంత పెద్ద దేశంలో కోట్లాది ఓటర్లతో కూడిన బృహత్ ప్రక్రియను ఎన్నికల సంఘం ఏ విధంగా నిర్వహిస్తూ వస్తున్నదో చూస్తూ ఉన్నారు కదా అని , పలు దశల ఎన్నికలు, ప్రజాస్వామిక ప్రక్రియలో కీలకంగా నిలుస్తూ రావడం వంటి అంశాలను ప్రస్తావించారు. సోమవారంతో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల సంపూర్ణం అవుతున్న దశలో ప్రధాని వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఎన్నికలకు కుంభమేళాలకు పోలికలు ఉన్నాయని పేర్కొంటూ మధ్యప్రదేశ్‌లోని షిప్రా నది ఒడ్డున వేలాదిగా లక్షలాదిగా తరలివచ్చే భక్తులతో కూడిన భారీ ఆధ్యాత్మిక సమ్మేళనంతో ఈ ప్రపంచానికి మనం ఇలాంటి ఉత్సవాలను కూడా సమర్థవంతంగా నిర్వహించగలమని తెలియచేసుకోవచ్చునని చెప్పారు. ఇలాంటి భారీ జనసమూహ ఉత్సవాల సందర్భంగా ఎప్పటికప్పుడు వినూత్న కృషి , దాని ఫలం వెల్లువెత్తుందని , ఇక్కడి ఏర్పాట్లను ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. వేలాది భక్తుల అనుసంధానికి సముచిత ఏర్పాట్లు చేయడం బ్రహ్మండమైన కార్యక్రమమే అవుతుందని తెలిపారు.
శ్రీలంక -భారత్ సంబంధాలు పటిష్టం
భారత్, శ్రీలంక దేశాల సత్సంబంధాలు మరింత పటిష్టం అవుతాయని ఆ దేశాధ్యక్షులు మైత్రీపాల సిరిసేన ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రోజుల పర్యటనకు వచ్చిన సిరిసేన ఉజ్జయిని కుంభమేళకు హాజరయిన సందర్భంగా విచార్ కుంభలో మాట్లాడారు. భారత్‌లో బౌద్ధం పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించిన అనగారిక ధర్మపాలా విగ్రహాన్ని సిరిసేన ఆవిష్కరించారు. అనేక అంశాలలో ఉభయదేశాల మధ్య శతాబ్దాలుగా ఉన్న స్నేహం పలు రంగాలలోకి విస్తరించుకుని పోయిందని, ఇక్కడ ఈ విగ్రహ ఆవిష్కరణకు తనను ఆహ్వానించడం పరస్పర సహోదరత్వాన్ని, శుభాకాంక్షల తత్వాన్ని నిర్థారిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ప్రధాని మోడీ , చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా హాజరు అయ్యారు. ఉభయదేశాల సంబంధాలు మరింత పటిష్టం అవుతాయని శ్రీలంక నేత తెలిపారు.