Home సినిమా అంకితభావానికి షాక్

అంకితభావానికి షాక్

దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ, హీరో సుధీర్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సమ్మోహనం’ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ అదితిరావు హైదరీ మంచి సక్సెస్‌ను అందుకుంది. ఈ భామ అంతకుముందు మణిరత్నం డబ్బింగ్ ఫిలిం ‘చెలియా’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అంతరిక్షం’ చిత్రంలో వరుణ్‌తేజ్‌తో పాటుగా అదితి కూడా వ్యోమగామిగా నటిస్తోంది. దీంతో 50 రోజుల పాటు హార్నెస్ (ఆస్ట్రోనాట్స్ ధరించే బెల్ట్)తో ఆమె షూటింగ్‌లో పాల్గొంది. అదేమీ అంత సులువైన విషయం కాదు. దీంతో అదితీకి నడుము నొప్పి వచ్చిందట. కానీ కేవలం రెండు రోజులు మాత్రం రెస్ట్ తీసుకొని మళ్లీ షూటింగ్‌కు సిద్ధమైపోయిందట. అదితి అంకితభావం చూసి సినిమా టీమ్ షాక్ అయిందట. ఈ రేంజ్‌లో కష్టపడుతోందంటే ఖచ్చితంగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రే అయి ఉంటుంది. మరి అదితి తన నటనతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Everyone Shocked For Aditi Rao Dedication

Telangana News