Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

రిలయన్స్ వార్షిక సమావేశంపైనే అందరి దృష్టి

Ambaniన్యూఢిల్లీ : జియోతో టెలికామ్ రంగంలోకి ప్రవే శించి సంచలనం సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రేపు నిర్వహించబోయే వార్షిక సమావేశంపై అందరి దృష్టి నెలకొంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వార్షిక సాధారణ సమావేశం(ఎజి ఎం)  శుక్రవారం జరగనుందది. ఈ సమావేశంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకట నలు చేయనున్నారని తెలుస్తోంది. దీంతో ఈ సమా వేశంలో చేయబోయే ప్రకటనలపై అంతా ఆతృ తగా ఎదురుచూస్తున్నారు. ఈ సమావేశంలోనే అత్యంత చౌకైన 4జి ఫీచర్ ఫోన్‌ను రిలయన్స్ విడుదల చేయనుందని సమాచారం. ఈ ఫోన్ రూ.500కే మార్కెట్‌లోకి తీసుకురా బోతున్నా రంటూ ఇప్పటికే పలు ఆసక్తికర నివేది కలు వస్తున్నాయి. మరోసారి ఈ ఫోన్‌తో ముఖేష్ అంబానీ మొబైల్ రంగంలో కూడా సంచలనాలు సృష్టించబోతున్నారని తెలుస్తోంది. మరోవైపు జియో ఫీచర్ ఫోన్‌ను తయారుచేసేందుకు ఈ కం పెనీకి ఇంటెక్స్‌కు మధ్య సంప్రదింపులు జరుగుతు న్నట్టు తెలిసింది. ఈ మానుఫ్రాక్చరింగ్ చర్చలు తుది దశలో ఉన్నాయని ఇంటెక్స్ స్పష్టంచేసింది. అలాగే బ్రాడ్‌బ్యాండు నెట్‌వర్క్ జియోఫైబర్‌ను  రిలయన్స్  ఆవిష్కరించబోతుందని, ఇది కూడా సంచలనాన్ని సృష్టించనుందని సమాచారం.

Comments

comments