Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

పర్యావరణాన్ని పరిరక్షణలో… అందరి భాగస్వామ్యం అవశ్యం

Everyone's participation in the conservation environment

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి                                                                                                                                                                  ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జేసీ

మన తెలంగాణ/సంగారెడ్డి: ప్లాస్టిక్‌ని నిర్మూలించి పర్యావరణాన్ని కాపాడాలని సంగా రెడ్డి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం పురపాలక సంఘం, శ్రీమన్నారాయణ ఛారిటబుల్ ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ను నిర్మూలించి పర్యావరణా న్ని కాపాడాలంటూ ఐబి నుంచి పాత బస్టాండ్ వరకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మెప్మా, మున్సిపల్ అధికారులు, ఛారిటబుల్ ట్రస్టు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పట్టణాన్ని ప్లాస్టిక్ నిషేధిత, స్వచ్ఛ పట్టణంగా చేయడంలో ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. ప్రజల భాగస్వామ్యం, సహకారంతోనే ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడం సాధ్యపడుతుందన్నారు. భావితరాలకు కాపాడటానికి నేనుసైతం ప్లాస్టిక్‌ని నిషేధిస్తానంటూ ప్రతి ఒక్కరు ముందుకురావాలన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ ప్లేట్లు, కవర్లు, గ్లాసులు, టీకప్పులు తదితరులు వినియోగిస్తున్న హోటళ్లు, కిరాణ, ఫంక్షన్ హాళ్లు, కూరగాయలు, పండ్లు, పూల దుకాణదారులు, టీఫిన్, స్నాక్స్ సెంటర్లు, రోడ్డు పక్కన వ్యాపారాలు నిర్వహించే దుకాణదారులు తదితరులు ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలించడానికి తమవంతు బాధ్యతగా సహకరించాలన్నారు. ర్యాలీలో బాగంగా పూలు, బట్టల షాపు, హోటళ్లు, స్వీట్‌షాపులు, పండ్లషాపుల్లోకి వెళ్లి తులిసి మొక్కలను అందజేసి ప్లాస్టిక్‌ను వాడరాదని కోరారు. ఈ ర్యాలీలో జేసి నిఖిల, మున్సిపల్ చైర్‌పర్సన్ బొంగుల విజయలక్ష్మీ, మెప్మా పిడి అంబదాసు, కమీషనర్ ప్రసాద్‌రావు, సీడీసీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నరహరిరెడ్డి, జడ్‌పిటిసి మనోహర్‌గౌడ్, ట్రస్టు సభ్యులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.

Comments

comments