Home సంగారెడ్డి అంతా నా ఇష్టం!

అంతా నా ఇష్టం!

cartoon

*ఆఫీసుకు రాను.. సమస్యలుంటే ఫోన్‌లోనే
*ట్రాన్స్‌ఫార్మర్ కావాలని దరఖాస్తు పెట్టినా ఫలితం లేదు
*స్తంభాలు వంగినా పట్టించుకోని విద్యుత్ శాఖ ఎఈ
*ఎఈని తొలగించాలని వినియోగదారుల సదస్సులో పలువురి వినతులు

మన తెలంగాణ/మునిపల్లి : మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత మండల ఎఇ రాజ్ కుమార్‌కు తమ గోడు వెళ్ళబోసుకున్నా సమస్యల ప ట్ల స్పందించడంలేదని ప్రజలు వాపోతున్నారు. పైగా మండలానికి తానే బాస్‌నని సమస్యలు ఎక్కడ ఉన్నాయో తనకు తెలియదా అంటూ తమకు సమాధానమిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. మండలంలో మూడు నెలలకోసారి నిర్వహించే సర్వసభ్య సమావేశాలు విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు సదస్సులకు తాను హాజరు కాబోనని ఘంటాపథంగా చెబుతున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాను… ఇష్టం వచ్చినప్పుడు వెళతాను అని చెబుతూ తమ సమస్యలను పట్టించుకోవడంలేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనేకమార్లు మండల సర్వసభ్య సమావేశాలకు హాజ రు కాని సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయని, వీటిపై ఆయన్ను నిలదీసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం రూ.125లకే విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోతోందని, డిడి కట్టి నెలలు గడుస్తున్నా మీటర్లు సరఫరా చేసిన పాపాన పోవడంలేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూ ల్‌లో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని పాఠశాల ప్రి న్సిపల్ దరఖాస్తు చేసి రోజులు గడిచినా ఇప్పటివరకు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయలేదని ఇటీవల విద్యుత్ వినియోగదారుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ప్రిన్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎఇ రాజ్‌కుమార్ అందుబాటులో ఉండి కూడా విద్యుత్ సమస్యలు పరిష్కరించడంలేదని, ఏదైనా సమస్య ఉంటే ఫోన్‌లో చెబితే పరిష్కరిస్తానంటు సమాధానమిస్తున్నారని పేర్కొంటూ ఎడికి సిపిఎం మండల నాయకులు రమేష్‌గౌడ్ ఫిర్యాదు చేశారు. మండల పరిధిలోని పెద్దగోపులారం గ్రామంలో విద్యుత్ వైర్ల ప్రమాదంలో మరణించినవారి కుటుంబానికి ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని, దీనికి కారణం ఎఇ రాజ్‌కుమార్ అంటూ బా ధిత కుటుంబానికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలంటు ఫోరం దృష్టికి తీ సుకెళ్ళినట్లు రమేష్‌గౌడ్ తెలిపారు. మునిపల్లి గ్రామంలో విద్యుత్ స్థంబా లు ఒరిగిపోయి వైర్లు కిందికి వేలాడుతున్నాయని మరమ్మతులు చేపట్టాలని గ్రామానికి చెందిన యువజన నాయకుడు పరమేశ్వర్ ఫోరం దృషి కి తీసుకెళ్ళినట్లు తెలిపారు. ఎఇ రాజ్‌కుమార్‌ను ఈ విషయాలపై వివర ణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. ఇప్పటికైనా అధికారులు సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతున్నారు.