Home జాతీయ వార్తలు బిజెపి అభ్యర్థి ఇంట్లో ఇవిఎం ప్రత్యక్షం!

బిజెపి అభ్యర్థి ఇంట్లో ఇవిఎం ప్రత్యక్షం!

EVMజైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి ఇంట్లో ఒక ఇవిఎం లభించడంతో అక్కడి రిటర్నింగ్ అధికారిపై వేటు పడింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపిన వివరాల మేరకు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారి ఒకరు రిజర్వ్‌లో ఉంచిన ఒక ఇవిఎంను తీసుకుని బిజెపి అభ్యర్థి ఇంటికి వెళ్లినట్లు సమాచారం రావడంతో వెంటనే ఆ ఆధికారిని అక్కడ విధుల నుంచి తప్పించి ఆ ఇవిఎంను పోలింగ్ ప్రక్రియకు దూరంగా ఉంచారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పాలి రిటర్నింగ్ అధికారి మహవీర్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో జోధ్‌పూర్ నుంచి రాకేష్ అనే మరో అధికారికి బాధ్యతలు అప్పగించినట్లు ఇసి తెలిపింది. బిజెపి అభ్యర్థి ఇంట్లో ఖాళీగా పడి ఉన్న ఇవిఎంను చూపిస్తూ ఒక వీడియో వైరల్ కావడం ఈ రచ్చకు మూల కారణంగా తెలుస్తోంది.

EVM Found In BJP Candidates House, Rajastan EC removes the Pali Returning Officer