Home ఆంధ్రప్రదేశ్ వార్తలు జనసేనలో చేరిన లక్ష్మీనారాయణ

జనసేనలో చేరిన లక్ష్మీనారాయణ

Janasenaవిజయవాడ: సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఆదివారం జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. లక్ష్మీనారాయణకు జనసేన నుంచి ఎంపి సీటు ఇస్తున్నట్టు తెలిసింద.  లక్ష్మీనారాయణ అధికార టీడీపీలో చేరనున్నారన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎవరూ ఊహించని విధంగా  ఆయన జనసేనలో చేరారు. జన సేనలో చేరిన సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడారు. సమాజంలో మార్పు కోసం పవన్ పార్టీ స్థాపించారని ఆయన తెలిపారు. తాను ఓ జన సేన సైనికుడిగా పని చేసి, సమాజంలో మార్పు కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. జన సేనలో పని చేసే అవకాశం కలిపించిన ఆ పార్టీ చీఫ్ పవన్ కు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని లక్ష్మీనారాయణ ధీమా వ్యక్తం చేశారు. లక్ష్మీనారాయణతోపాటు కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ మాజీ విసి రాజగోపాల్‌ కూడా జనసేలో చేరారు. లక్ష్మీనారాయణ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఆదివారం సాయంత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

EX CBI JD Lakshmi Narayana Joins Janasena