Home జాతీయ వార్తలు ఢిల్లీకి చేరుకున్న మాజీ సిఎం నల్లారి

ఢిల్లీకి చేరుకున్న మాజీ సిఎం నల్లారి

Ex CM Nallari Arrived in Delhi

ఢిల్లీ : ఉమ్మడి ఎపి మాజీ సిఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరుతారన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన శుక్రవారం జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ కానున్నారు. అనంతరం ఆయన కాంగ్రెస్‌లో చేరుతారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు ఎపి నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు. కిరణ్‌తో పాటు ఎపి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఊమెన్ చాందీ, పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి తదితరులు కూడా రాహుల్‌తో భేటీ కానున్నారు.

Ex CM Nallari Arrived in Delhi