Home జిల్లాలు బడుగుల ఆశాజ్యోతి ‘బాబు జగ్జీవన్‌రాం’

బడుగుల ఆశాజ్యోతి ‘బాబు జగ్జీవన్‌రాం’

cpi* ఎల్బీనగర్‌లో ఘనంగా జయంతి వేడుకలు
మనతెలంగాణ/ఎల్బీనగర్‌ః భారత మాజీ ఉప ప్రధాని బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్‌రాం 109వ జయంతి వేడుకలు మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఎల్బీనగర్ రింగ్ రోడ్డులో బిజేఆర్, అంబేద్కర్ విగ్రహాలను అధికారులు పూలతో అత్యంత సుందరంగా అలంకరించారు. వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు విచ్చేసి జగ్జీవన్‌రాం విగ్రహానికి పూల మాలలు వేసి నివాలర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ గ్రేటర్ కౌన్సిల్ సభ్యురాలు గ్యార యాదమ్మ మాట్లాడుతూ అట్టడుగు వర్గాలు, బడుగులకు బిజేఆర్ అనేక సేవలందించారని అన్నారు. బిజెఆర్ చూపిన బాటలో అందరు పయనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ నాయకులు శివ, ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షులు గ్యార క్రాంతికుమార్, సహయకార్యదర్శి వెంకటాచారి, అజయ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
బిజేఆర్ భవన్‌లో…
పేదల పెన్నిథి, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్‌రాం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు దేప భాస్కర్‌రెడ్డి అన్నారు. బిజేఆర్ జన్మదినం సందర్భంగా ఆర్.కె.పురం డివిజన్‌లోని బిజెఆర్ భవన్‌లో బాబు జగ్జీవన్‌రాం విగ్రహానికి ఆయన పూల మాలలు వేసి ఘనంగా నివాలర్పించారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ బిజెఆర్ దేశానికి ఎనలేని సేవలు అందించాలరని కార్యక్రమంలో చిలుక మధుసుదన్‌రెడ్డి, ఎం.ఏ.వాజిద్ తదితరులు పాల్గొన్నారు.