Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

మాజీ ఎంఎల్ఎ కొడుకు ఆత్మహత్య…

MLA-son-nagarjuna-reddy-sus

కర్నూల్: బనగానపల్లె మాజీ ఎంఎల్ఎ కాటసాని రామిరెడ్డి పెద్ద కొడుకు నాగార్జున రెడ్డి (28) శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని బలవన్మరణానికి ఒడిగట్టాడు. ఈ మధ్యకాంలోనే నాగార్జున బిటెక్ పూర్తిచేసి ఇంటి దగ్గరనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి కుటుంబ సభ్యలతో కలిసి భోజనం చేసి తన బెడ్ రూంలో నిద్రపోయాడు. శుక్రవారం ఉదయం ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో కిటికీలోంచి చూడగా నాగార్జున రెడ్డి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. చేతికి అందొచ్చినా కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో కాటసాని రామిరెడ్డి కుటుంబమంతా శోక సంద్రంలో మునిగిపోయింది. అసలు నాగార్జున ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు..? అతని సమస్యలు ఏంటీ..? అనే విషయాలు ఇంకా తెలియాల్సిఉంది. కుటుంబ సభ్యల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

comments