Home తాజా వార్తలు టిడిపి తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపి..!

టిడిపి తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపి..!

Gangula-Pratap-Reddy

కర్నూలు : నంద్యాలలో మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నికలు జరుగనున్న వేళ ఎపి రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల వైసిపి నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన గంగుల ప్రభాకర్ రెడ్డి సోదరుడు, మాజీ ఎంపి గంగుల ప్రతాప్ రెడ్డి వైసిపి నుంచి తప్పుకొని తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం ఎపి మంత్రి అచ్చనాయుడుతో కలిసి ఆయన సచివాలయంలో సిఎం, టిడిపి అద్యక్షుడు చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు.