Home కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రభుత్వ పాఠశాలలోనే పరీక్ష కేంద్రాలు

ప్రభుత్వ పాఠశాలలోనే పరీక్ష కేంద్రాలు

పరీక్షల సమయంలోనే సౌకర్యాలపై
హడావుడి చేస్తున్న అధికారులు
మాస్ కాపీయింగ్‌కు చెక్కు పెట్టేందుకు సిసి కెమెరాలు
జిల్లాలో 28పరీక్ష కేంద్రాలకు ప్రాతిపాదనలు

Exam

ఆసిఫాబాద్:  పదోవతరగతి పరీక్షల్లో మాస్ కా పీయింగ్‌కు పాల్పడకుండా పకడ్భందీగా పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుంది. గత సంవత్సరాలకు భిన్నంగా ప్రభుత్వ పాఠశాలలోనే పదో వతరగతి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారు లు భావిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలో పరీక్ష కేంద్రాల ని ర్వాహణపై వస్తున్న విమర్శాలను,ఇబ్బందులను అధిగమిం చేందుకు ఈ పాఠశాలలపై వేటువేస్తున్నారు. ఏప్రిల్ 15 నుంచి ప్రారంభంకానున్న పదోవతరగతి వార్షిక పరీక్షలు సజావుగా జరిగేందుకు అన్ని వసతులు ఉండే ప్రభుత్వ పాఠశా లలను గుర్తించాలన్న విద్యశాఖ ఆదేశాలతో జిల్లా విద్యాశాఖా ధికారులు కసరత్తులు చేపడుతున్నారు.

పాఠశాలలో మంచినీరు, మూత్రశాల లు, బెంచీలు ప్రహారి ఇలా అన్ని సౌకర్యాలు ఉన్న పాఠశాల వివరా లను ఆయా మండలాధికారుల నుంచి ఉన్నతాధికారులకు నివేదికలు అందజే యనున్నారు. జిల్లాలో ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు కలిపి 148 పాఠశాలలో 5959 మంది విద్యార్దులు పదోవతరగతి పరీక్షలు రాసేందుకు సిద్దమవుతు న్నారు. ఇందుకో సం జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలను గుర్తించి ప్రాతిపదనలు పంపారు. గతంలో పదోవతరగతి పరీక్షలకు ప్రైవేటు పాఠశాలలో కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి నిర్వాహణపై మాస్ కాపీయింగ్ ప్రోత్సాహం ఇతరాత్ర ఆరోపణాలు రావడంతో ఈసారి అలాంటి వాటికి అలాంటివి జరగ కుండా చూడాలని ప్రభుత్వ భావిస్తోంది.

పదోవతరగతి పరీక్షలకు ఈప్రభుత్వ పాఠశాలలోనే పరీక్ష కేంద్రాలు ఏ ర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో జిల్లా విద్యాశాఖాధికారులు అదిశగా చర్యలు చేపట్టారు. 28ప్రభుత్వ పాఠశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చే సేందుకు జాబితాను సిద్దం చేసి ప్రాతిపదనలు పంపారు. గతంలో ఆసిఫా బాద్‌లోని సెయింట్ మేరీపాఠశాల, కాగజ్‌నగర్‌లోని ఫాతిమ పాఠశాల లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి వాటిస్దానంలో ఆసిఫా బాద్‌లోని జన్కాపూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల,కాగజ్‌నగర్‌లోని జడ్పి ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రాతిపదనలు పంపారు.

సిసి కెమెరాలు ఏర్పాటు చేసేనా?

పదోవతరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండాప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించే లా ప్రభుత్వం భావిస్తోంది. అందుకు ప్రైవేటు పాఠశా లలో పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు చోటు కల్పించ కుండా చర్యలు తీసుకుంటున్నారు. అదే విధ ంగా ప్రతి కేంద్రంలో సిసి కెమెరాలు ఉండే లా చూడాలని ఉన్నతాధికారులు ఆదే శించారు. గత సంవత్సరం ప్రయో త్మకంగా ప్రతి జిల్లాలో ఒక ప రీక్ష కేంద్రంలో సిసి కె మెరాలు ఏర్పాటు

చేసి పరీక్షలు నిర్వహించారు.

ఈ సారి అన్ని పరీక్ష కేంద్రాలలో సిసి కెమెరాలు ఏర్పాటుకు ప్రభుత్వం ప్ర యత్నిస్తుంది. సిసికెమెరాలు ఉన్న పాఠశాలలోనే ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సిసి కెమెరాలు ఉన్న పాఠశాలలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. కానీ ఎక్కడ ప్రభుత్వ పాఠశాలలో అవి లేకపోవడంతో మిగతా అన్ని సౌకర్యాలు ఉన్న పాఠశాలలకు విద్యాశాఖాధికారులు కేంద్రాలను గుర్తించారు. సిసికెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వ పాఠశాలలో నిధుల కొరత వేధిస్తుంది. ప్రభుత్వామే వీటిని ఏర్పాటు చేయాలని విద్యాశాఖ వర్గాలు చెప్పుతున్నాయి. దీని పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చాడాలి.

ప్రభుత్వ పాఠశాలలో బెంచీల కొరత

పరీక్ష సమయంలో పరీక్ష కేంద్రాలలో సౌకర్యాలు,సదుపాయాల ఏర్పాటుకు అధికారులు హడావిడి చేస్తున్నారు తప్పా,ముందస్తుగా ఎటువంటి చర్యలు తీసు కోవడంలేదని విద్యార్దుల తల్లిదండ్రులు వాపోతున్నారు. జిల్లాలో 28 పరీక్ష కేం ద్రాల ఏర్పాటుకు విద్యాశాఖ ప్రాతిపదినలు సిద్ధం చేశారు. వీటిలో ఆశ్రమ పా ఠశాలలు,గురుకులాలు,కస్తూర్భా పాఠశాలలో పది వరకు ఉన్నాయి. వీటిలో ప్రహారిగోడ,త్రాగునీరు,మరుగుదోడ్లు,బెంచీలు ఉన్న మిగత ప్రభుత్వ ఉన్నత పా ఠశాలలో పూర్తి స్దాయిలో బెంచీలు,ప్రహారిగోడలు లేవు. 28 పరీక్ష కేంద్రాలలో 50 శాతం వరకు డెస్క్ బెంచీలు 20శాతం సాధారణ బెంచీలు ఉన్నట్లు సమా చారం. ఇక 30శాతం బెంచీలు అవసరం ఉన్నాయి.

పరీక్షల సమయంలో వీటిని ఇతర పాఠశాలల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్దితి ఏర్పడుతుంది. పిల్లలు సౌకర్యవంతంగా కూర్చోని పరీక్షలు రాయడానికి వీలుగా డెస్క్ బెంచీలు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమవుతున్నట్లు ఆరోపణా లుఉన్నాయి. కొన్ని పాఠశాలలో మరుగుదోడ్లు,ఫ్యాన్‌లు కూడ లేవు. సాధారణ బెంచీల పై రెండున్నర గంటల పాటు కదలకుండా కూర్చోని పరీక్షలు రాయడం విద్యార్దులకు పెద్దపరీక్షే..

ప్రభుత్వ పాఠశాలలోనే పరీక్ష కేంద్రాలు గుర్తించాం
– డిఈఓ రఫీక్

ప్రభుత్వ పాఠశాలలోనే పదోవతరగతి పరీక్ష కేంద్రాలు ఏర్పాటుకు ప్రాతిప దించమని జిల్లాలో 5959 మంది రెగ్యూలర్ విద్యార్థులకు 28 కేంద్రాలు గతం లో పెయిల్ విద్యార్దులు 1065 మందికి 5 కేంద్రాల ఏర్పాటుకు ప్రాతిపదినలు పంపించారు. ప పాఠశాలలో ప్రహారి ,మంచినీరు,మరుగుదొడ్లు ,బెంచీలు అన్ని సౌకర్యాలను తీసుకొని పరీక్ష కేంద్రాలను గుర్తించాం. సిసికెమెరాలు ప్రభుత్వం అందజేస్తే పాఠశాలలో ఏర్పాటు చేయిస్తాం. పదోవతరగతి పరీక్షలు పకడ్బ ందీగా విద్యార్థ్దులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాం.