Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

 గుప్త నిధుల కోసం తవ్వకాలు

 Excavation for hidden treasures In Suryapet District

అర్వపల్లి: గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన మండల కేంద్రంల్లో చోటు చేసుకుంది. నేడు ఒక వైపు కంప్యూటర్ యుగం ఎటువంటి భూతాలు దయ్యాలు లేవు, మానవుడు చంద్రుడుపై కాలు మోపి అక్కడ నివాసం చేసుకోవాలనుకొంటున్న యుగంలో నేటి తరాల్లో మనిషి భూతాలు దయ్యాలు ఉన్నాయని భూమిలో బంగారం ఉందంటు అర్ధరాత్రి సమయంలో బంగారం కోసం తను కొన్న ఇంటిలో బంగారం ఉందని తవ్వకాలు జరుపుతుండగా స్థానికులు,చుట్టు ప్రక్కలవారు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తవ్వకాలు జరుపుతున్న వారిపై, ఇంటి యజమానిపై కేసు నమోదు చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలకేంద్రంలో నూతన రహదారి జరుగుతున్న నిత్యం రోడ్డుపై ఎవరో ఒకరు సంచారం చేస్తూ ఉంటారు. అటువంటి రోడ్డు ఆనుకోని ఉన్న ఖాళీ స్థలంలో గుట్టుచప్పుడు కాకుండా గుప్త నిధులకోసం చెట్టు తొర్రను ఆసరా చేసుకోని గత మూడు రోజుల నుండి తవ్వకాలు జరిపారని తెలిపారు.

Comments

comments