Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

 Excellence Awards for Best Students

మన తెలంగాణ/ వికారా-బాద్ రూరల్ : విజ్ఞాన కాంతులతో వెలుగుతూ సరస్వతీ కటాక్షాన్ని సొంతం చేసుకున్న విద్యార్థుల్ని అభినందిస్తున్నాను అని జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. సోమవారం ఆర్యవైశ్య వేడుక వేదికలో జిల్లాలో ఉత్తమ ప్రతిభ చూపిన ఆర్యవైశ్య విద్యార్థులకు సన్మాన కార్యక్రమం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు యాస్కి కిష్టయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను కూడా పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎంఏలో ఉత్తమ ప్రతిభ చూపానన్నారు. పట్టుదలతో చదివి జిల్లా కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపడుతున్నానని ఆయన అన్నారు. మార్కుల కొరకే ఉత్తమ ప్రతిభ చూపకుండా, లక్ష్యాన్ని చేరే వరకు పట్టువిడువరాదన్నారు. సమాజంలో సముచిత స్థానం, గౌరవం పొందాలంటే కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారికి స్కాలర్‌షిప్పులు, విదేశాలలో చదువుకొనుటకు 20 లక్షల రూపాయల ఋణ సౌకర్యం కల్పించిందన్నారు. ఆర్యవైశ్య పిల్లలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుటకు అవకాశం ఉన్నదన్నారు. చదువులో ఉత్తమ ప్రతిభ చూపిన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల పిల్లలతో పాటు ఓసి పిల్లలకు ప్రభుత్వం ఋణ సౌకర్యాన్ని కల్పించిందన్నారు. సోషల్ మీడియా మాయలో పడి నేటి విద్యార్థులు చదువును నిర్లక్షం చేస్తున్నారన్నారు. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు గౌరవ మర్యాదలు ఇవ్వాలంటే మీరు ఏకాగ్రతతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. మున్సిపల్ చైర్మెన్ విశ్వనాథం సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘానికి 2 ఎకరాల ప్రభుత్వ స్థలం చూపాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. మున్సిపల్ పరిధిలో తాగు నీటి సమస్యను పరిష్కరించుటకు చక్కని మార్గాన్ని చూపారని ఆయన కొనియాడారు. నిరుపేద ఆర్యవైశ్య విద్యార్థులను చదివించుటకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు బాలేశ్వర్ గుప్త, జిల్లా మహిళా విభాగ్ అధ్యక్షురాలు ఆకుతోట వీరమణి గుప్త, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు మాలె లక్ష్మణ్, జిల్లా సేవాదల్ అధ్యక్షుడు ఆకారపు రాజు గుప్త, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కజ్జం రాంచంద్రయ్య, పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి మాణిక్య ప్రభు, పట్టణ ఆర్యవైశ్య కోశాధికారి  మురళి పాల్గొన్నారు.

Comments

comments