Search
Monday 24 September 2018
  • :
  • :

సమిష్టి కృషితో అద్భుత ఫలితాలు సాధ్యం

Retairment-image

చిన్నజిల్లాల ఏర్పాటుతో జిల్లా స్థాయి అధికారులుగా పనిచేసే అవకాశం
బదిలీపై వెళ్తున్న ఐదుగురు జిల్లా అధికారులకు ఘనంగా వీడ్కోలు
జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి

మన తెలంగాణ/మెదక్ : అధికారులందరూ తమ బాధ్యతలను గుర్తెరిగి విధులు నిర్వర్తించినప్పుడే అద్భుత ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన బదిలీలతో ఇతర జిల్లాకు వెళ్లిన జిల్లా అధికారులకు వీడుకోలు, సన్మాన సభను శుక్రవారం కలెక్టరేటు నందు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందని, చాలామంది అధికారులు చిన్న జిల్లాల ఏర్పాటుతో జిల్లాస్థాయి అధికారులుగా పనిచేసే అవకాశం లభించిందన్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతలను విస్మరించకుండా విధులు నిర్వహించినప్పుడు అద్భుత ఫలితాలు వస్తాయని దీంతోపాటు ప్రజల మన్ననలు కూడా పొందుతామన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కోటాజి, తూనికల కొలతల జిల్లా అధికారి శ్రీనివాస్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారినీ రేవతి, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి చక్రపాణి, జిల్లా మత్సశాఖ అధికారి లక్ష్మినారాయణలు జిల్లా ఏర్పాటు నుండి జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాత జిల్లాలో ఉన్న ఉద్యోగులను జిల్లాకు విభజించారని దీంతో ఆయా శాఖల్లో 20 నుంచి 40 శాతం ఖాళీగానే ఉన్నప్పటికీ పట్టుదలతో ఒక టీం స్పిరిట్‌తో విధులు నిర్వర్థించడం జరిగిందన్నారు. కొత్త అధికారులు కూడా బాధ్యతలను గుర్తెరిగి విధులు నిర్వర్థించినప్పుడే ఫలితాలు రాబట్టడం సులువవుతుందని గుర్తుచేశారు. నెలకోసారి ఉద్యోగులు అందరూ కలిసి సమస్యలపై చర్చించుకునే విధంగా గెట్ టూ గెదర్ సమావేశాలు ఏర్పాటు చేసేలా జిల్లా అధికార సంఘం, డిఆర్‌వో కృషి చేయాలని ఆదేశించారు. అంతకు ముందు జిల్లా అధికారుల సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డితో పాటు జిల్లా అధికారులు హనూక్, జ్యోతిపద్మ, యేసయ్య, సుధాకర్, గణేష్‌లు వారితో పనిచేసిన అనుభవాల్ని పంచుకున్నారు. బదిలీపై వెళ్తున్న అధికారులు మాట్లాడుతూ… మెదక్ జిల్లాలో విధులు నిర్వర్థించడం చాలా సంతోషంతో పాటు తృప్తినిచ్చిందని, జిల్లా ప్రజలు సౌమ్యులని అన్నారు. జిల్లా నుంచి బదిలీపై వెళ్తున్నందుకు బాధగానే ఉన్నప్పటికీ ఉద్యోగ రిత్యా పదోన్నతులు, బదిలీలు తప్పవు కాబట్టి వెళ్తున్నామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ బదిలీపై వెళ్తున్న జిల్లా అధికారులను శాలువాలు, పూలమాలలతో సత్కారించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాములుతో పాటు ఇతర జిల్లా అధికారులు తదీతరులు పాల్గొన్నారు.

Comments

comments