Home తాజా వార్తలు గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు…

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు…

Excise Attacks

 

నర్సింహులపేట: గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ, స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. నర్సింహులపేట మండలంలోని బొడ్డితండ, రూప్లాతండా, బండమీదితండా, మద్దుతండాలో దాడులు నిర్వహించారు. పది లీటర్ల గుడుంబా, 300 లీటర్ల బెల్లం పానకం పట్టుపడగా వాటిని ధ్వసం చేసినట్లు తెలిపారు. గుడుంబా తయారీదారులు ఇద్దరిపై కేసు నమోదు చేశామని ఒకరు పరారీ అయ్యారని డిటిఫ్ మహబూబాబాద్ సిఐ కిషోర్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… గుడుంబా తయారు చేస్తే పిడి యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ దాడుల్లో తొర్రూర్ ఎక్సైజ్ ఎస్‌ఐ బాబు, ఎక్సైజ్ సిబ్బంది, స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

Excise Attacks on Gudumba Settlements