Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఎక్సైజ్ అధికారుల మెరుపుదాడి

ఇద్దరిపై కేసు నమోదు

Police1

వనపర్తి ప్రతినిధి: వనపర్తి జిల్లా మధ్య నిషేద అధికారి నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ఖిల్లాగణపురం మండలం లోని దొంతికుంట తాండాలో నాటుసారా తయారి కేంద్రాలపై  ఎక్సైజ్ సిబ్బంది మెరుపుదాడులు నిర్వహించారు.  ఈ దాడుల్లో 275 కేజీల నవసాగరం ,పది లీటర్ల నాటుసారా, 20 కేజీల బెల్లాన్ని ,20 బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకుని 700 లీటర్ల  బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడం జరిగిందని జిల్లా మధ్య నిషేద అధికారి నవీన్‌కుమార్ తెలిపారు.  తాండాకు చెందిన ముడావత్ జంపాల్, లావుడ్యా,రెడ్యానాయక్ లను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఈ దాడుల్లో వనపర్తి , కొత్తకోట, ఆత్మకూర్ , పట్టణాలకు చెందిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది మరియు మహబూబ్‌నగర్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్,ఎక్సైజ్  సిఐలు  పాల్గొన్నారు.

Comments

comments