Home నాగర్ కర్నూల్ సిండికేట్‌కు ఎక్సైజ్ అండ?

సిండికేట్‌కు ఎక్సైజ్ అండ?

పక్షం రోజులుగా ప్రచారం
గతంలోను బెల్టు షాపుల వేలం

                    Syndicate-bank

నాగర్‌కర్నూల్ ప్రతినిది: తెల్కప ల్లి మండలంలో ఆదివారం బెల్టు షాపుకు వేలం పాట విషయం వెలుగు చూసిన తర్వాత ఆ మం డలంలో ఎక్సైజ్, మధ్యం వ్యాపారుల దోస్తాన్ గు రించి పలువురు ఆసక్తి కరంగా చర్చించుకుం టు న్నారు. తెల్కపల్లిలోని మధ్యం వ్యాపారులు, ఎక్సై జ్ అధికారులు మిలాకత్ అయి గ్రామాల్లో బెల్టు షాపులకు టెండర్‌లను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మండలంలోని రాయిపాకుల ,పెద్దపల్లి, గట్టునెల్లికూదురు గ్రామాలతో పాటు మరి కొన్ని గ్రామాల్లో కూడా బెల్టు వేలాలు కొన సాగుతున్నట్లు తెలిసింది.కొన్ని గ్రామాల విషయం పత్రికల్లో వచ్చిన ఎక్సైజ్ గాని,పో లీస్ అధికారులు గాని స్పందించిన దాఖ లాలు లేవు. ప్రత్యక్షంగా ఎక్సైజ్ ప్రోత్సా హంతోనే ఈ వేలం పాటలు కొనసాగుతు న్నాయన్న ఆరోపణలకు ఆలేరు సంఘటన ఊతమిస్తున్నది.

ఇక ఆలేరు విషయానికి వస్తే గ్రామంలో ప్రతి కిరాణం మధ్యం అమ్మకాలు జరిగేవి. నిత్యం రూ.50 వేలు దాకా మధ్యం అమ్మకాలు జరుగుతాయని పలువురు గ్రామస్తులు తెలిపారు. ఒక్కో మధ్యం సీసాపై రూ. 30 వరకు అదనంగా వసులు చేసేవారు. ఒక వర్గానికి చెందిన వారే ఈ లాభం పొందుతున్నారన్న ఆలోచ న , ఇతరత్రా కారణాలతో కొందరి ప్రోత్సా హంతో బెల్టు బహిరంగ వేలానికిరూప కల్పన చేసినట్లు తెలిసింది. ఒక పాఠశాల ఆవరణంలోనే వేలం నిర్వహించారంటే వారి వెనుక ఉన్న మధ్యం దుకాణాలు, ఎక్సైజ్ ప్రోత్సాహం బలం, ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమౌతుంది.

కాగా బెల్టు షాపులను ప్రోత్సహించి తాము అధిక ధరలు వసులు చేసుకోవడంతో పాటు మ ధ్యం అమ్మకాలు పెంచుకునేందుకు ఎక్సైజ్ అధికారులు అడ్డు రాకుండా మేనేజ్ చేసే బాధ్యత మధ్యం వ్యాపారులు చూసుకునే వారట. ఏది ఏమైనా జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న గ్రామాల్లో ఇంత విచ్చలి విడి ఉల్లంఘనలు జరుగుతున్న వేలంపై 15 రోజులుగా ప్రచారం జరుగుతుంది. నూతన జిల్లాల వల్ల ప్రజలకు చేరువగా పాలనా యంత్రాంగం అంటు ఊదర గొడుతున్నారు. ఒక్కో గ్రామంలో వివిధ శాఖలకు చెందిన దాదాపు 20 మంది అధికారులు వారిపై పర్యవేక్షకులు ఉన్నా రు. చీమ చిటుక్కుమన్న క్షణాల్లో సమాచా రం సేకరించి ఉన్నతాధికారుల చెవిలో వేసే విలేజ్ పోలీస్‌లున్నారు. అయినా చట్ట విరుద్దమైన మధ్యం బెల్టు షాపుల వేలం గురించి 15 రోజులుగా పోస్టర్‌లు వేసిన ప్రచారం చేసిన అధికారుల దృష్టికి రాకపో వడం వీరి పని తీరు స్పష్టం చేస్తుంది.