Search
Friday 16 November 2018
  • :
  • :

విలన్ అవుదామని వస్తే కామెడీ హీరోను చేశారు

Exclusive Interview With Allari Naresh

కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అల్లరి నరేష్. అలాగని అతను కేవలం కామెడీ మాత్రమే పండించగలరని అనుకుంటే పొరపాటే. కొన్నిసార్లు భావోద్వేగాలను కూడా బాగా పండించగలరు. ఆయన నటించిన ‘సిల్లీ ఫెలోస్’ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా అల్లరి నరేష్‌తో ఇంటర్వూ…
సంతోషంగా అనిపించింది…
దర్శకుడు భీమినేని శ్రీనివాస్ చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది. నేను తమిళ వర్షన్ మూవీ కూడా చూశాను. సినిమాలో నా స్నేహితుడు సూరి పాత్రలో సునీల్ నటిస్తారనగానే ఎంతో సంతోషంగా అనిపించింది.
పోటాపోటీగా నటించాం…
భీమినేని శ్రీనివాస్ స్క్రిప్ట్ మీద చాలా వర్క్ చేశారు. దాంతో నేను ఎంతో స్వేచ్ఛగా సినిమా చేశాను. సినిమాలో సునీల్, నేను పోటాపోటీగా నటించాం. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ కథను మేం చేస్తే బావుంటుందని బాగా సపోర్ట్ చేశారు.
అవన్నీ ఉంటాయి…
నా దగ్గర, సునీల్ దగ్గర ఏవైతే ప్రేక్షకులు మిస్ అయ్యామని భావించారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. అంటే కడుపుబ్బ నవ్వించే కామెడీ ఉంటుందన్నమాట.
ఒక షెడ్యూల్ చేశా…
మా పాప పుట్టిన తర్వాత నేను సంతకం చేసిన తొలి సినిమా ‘మహర్షి’. ఈ సినిమా ఒక షెడ్యూల్ చేశాను. ఈ చిత్రంతో ఇంకా 100 రోజులు ప్రయాణిస్తా.
నవ్వుతూ ఉంటారు…
మహేష్‌తో కలిసి సినిమా చేయడం ఎంతో హ్యాపీగా అనిపించింది. అతను చాలా మంచి మనిషి. ఎదుటివారు చెప్పే జోకులకు నవ్వుతూ ఉంటారు.
కామెడీనే కోరుకుంటున్నారు..
నాకు ‘శతమానం భవతి’ వంటి కథను పూర్తి కామెడీతో చేయాలని ఉంది. నేను రఘువరన్‌లాగా విలన్ అవుదామని సినిమాల్లోకి వచ్చాను. అయితే రవిబాబు నన్ను కామెడీ హీరోను చేశారు. అప్పటి నుంచి ప్రేక్షకులు నా దగ్గర నుంచి కామెడీనే కోరుకుంటున్నారు.
విజన్ 2020…
నా డైరెక్షన్ కోసం విజన్ 2020 అని పేరు పెట్టుకున్నా. అందరూ కొత్తవారితోనే సినిమా చేస్తా. ఒక్క ఫ్రేమ్‌లోనూ నేను ఉండను.
తదుపరి చిత్రాలు…
ప్రస్తుతం మహేష్‌బాబుతో ‘మహర్షి’ సినిమా చేస్తున్నాను. దర్శకుడు మారుతితో ఓ సినిమా చర్చల్లో ఉంది. గిరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ఈమధ్యనే పొల్లాచ్చిలో షూటింగ్ చేశాం.

Comments

comments