Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కామెడీ రోల్స్ చేస్తేనే స్వేచ్ఛ ఎక్కువ

Exclusive Interview With Comedian Sunil

అల్లరినరేష్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ, నందినిరాయ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘సిల్లీఫెలోస్’. భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బ్లూ ప్లానెంట్ ఎంటర్‌టైన్‌మెంట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లపై కిరణ్ రెడ్డి, భరత్‌చౌదరి నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 7న విడుదలకానుంది. ఈ సందర్భంగా సునీల్‌తో ఇంటర్వూ విశేషాలు…
ఆతర్వాత హీరోగా వరుసగా సినిమాలు…
నేను మొదటిసారి హీరోగా నటించిన ‘అందాల రాముడు’ సినిమా మంచి విజయం సాధించిన తర్వాత నాకు హీరోగా చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ నేను ఏ సినిమా ఒప్పుకోలేదు. అనంతరం రాజమౌళి దర్శకత్వంలో ‘మర్యాద రామన్న’ సినిమా చేయడంతో ఇక హీరోగా సినిమాలు చేయవచ్చనే నమ్మకం వచ్చింది. ఆతర్వాత హీరోగా వరుసగా సినిమాలు చేశాను.
బాగా ఎంజాయ్ చేస్తారు…
అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘సిల్లీ ఫెలోస్’. సినిమా మొత్తం చాలా సరదాగా, వినోదాత్మకంగా ఉంటుంది. ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.

ప్రేక్షకులను నవ్విస్తాయి
సినిమాలోని ప్రతి సన్నివేశంలో హీరో నరేష్ పాత్రతో నా పాత్ర ముడిపడి ఉంటుంది. కథ విషయానికొస్తే నరేష్ చేసే కొన్ని పనుల కారణంగా నేను ఓ సమస్యలో చిక్కుకుంటాను. అందులో నుంచి బయటపడడానికి నేను పడే పాట్లు ఆసక్తికరంగా ఉంటూ ప్రేక్షకులను నవ్విస్తాయి.
కామెడీ టైమింగ్‌లో అవగాహన…
అల్లరి నరేష్‌తో కలిసి నేను చాలా సినిమాల్లో నటించాను. ‘తొట్టి గ్యాంగ్’ తర్వాత అతనితో కలిసి నేను ఈ సినిమాలో పూర్తి స్థాయి పాత్ర చేశాను. ఇక కామెడీ టైమింగ్‌లో మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. ఈ సినిమా కోసం ఎంజాయ్ చేస్తూ పనిచేశాం.
సంతోషంగా ఉంది…
కామెడీ రోల్స్ చేస్తేనే నాకు స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. హీరోగా సాధ్యం కానటువంటి వివిధ పాత్రలను కమేడియన్‌గా నేను చేయవచ్చు. ఏదేమైనా నేను మళ్లీ కమేడియన్‌గా తిరిగి వస్తున్నందుకు సంతోషంగా ఉంది.
మరచిపోలేని అనుభవం…
త్రివిక్రమ్ నా కోసం ‘అరవింద సమేత…’లో ఓ మంచి పాత్ర రాశాడు. ఇందులో ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం మరచిపోలేని అనుభవాన్నిచ్చింది. గతంలో తారక్‌తో కలిసి కొన్ని సినిమాలు చేశాను. అతని ఆత్మవిశ్వాసం, స్వచ్ఛమైన వ్యక్తిత్వం చాలా గొప్పవి.
తదుపరి చిత్రాలు…
ప్రస్తుతం శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమాలో రవితేజ, నాకు మధ్య వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. అలాగే శర్వానంద్ ‘పడి పడి లేచే మనసు’లో కూడా ఓ ఆహ్లాదకరమైన పాత్రలో కనిపించబోతున్నాను.

Comments

comments