Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

అదే ‘లక్ష్మి’లో స్పెషల్

Exclusive Interview With Prabhudeva

ప్రముఖ డాన్స్‌మాస్టర్, దర్శకుడు ప్రభుదేవా నటించిన తాజా చిత్రం ‘లక్ష్మి’. తమిళ భాషలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో కూడా అదే టైటిల్‌తో ఈనెల 24న విడుదల కానుంది. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుదేవా చెప్పిన సినిమా విశేషాలు…
ఆయనకు బెస్ట్ పిక్చర్…
గురుశిష్యుల మధ్య జరిగే కథ ‘లక్ష్మి’. దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఆయన కెరీర్‌లో ఇది బెస్ట్ పిక్చర్ అవుతుంది.
కొత్తదనంతో కూడిన…
ఈ చిత్రానికి ‘లక్ష్మి’ టైటిల్ సరిగ్గా సరిపోతుంది. సినిమా చూశాక అందరూ ఇదే ఫీల్ అవుతారు. కొత్తదనంతో కూడిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది.
అలా ఎవరూ చేయలేదు…
ఈ సినిమాలో మూడున్నర నిమిషాలు పాట లేకుండా, మ్యూజిక్ లేకుండా డాన్స్ చేశాం. ఇప్పటివరకు అలా ఎవరూ చేయలేదు. ఈ చిత్రంలో ఇది సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుంది. ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
కష్టమైన మూమెంట్స్‌తో…
పరేష్, రుయల్ అనే ఇద్దరు డాన్స్ మాస్టర్లు ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్లుగా చేశారు. ఇండియా లెవెల్‌లో డాన్స్ ఉండాలని చెప్పడంతో వారు కొంచెం కష్టంగా ఉండే డాన్స్ మూమెంట్స్ చేశారు.
తదుపరి చిత్రాలు…
ప్రస్తుతం పోలీస్ స్టోరీ నేపథ్యంలో ఉండే ఒక సినిమాలో నటిస్తున్నాను. అలాగే 1983 నాటి కుంగ్‌ఫూ కథతో ఓ సినిమా, సీరియల్ కిల్లర్ నేపథ్యంలో మరో సినిమా చేస్తున్నాను. అభినేత్రి-2 చిత్రంలో కూడా నటిస్తున్నాను. అయితే ధనుష్ ‘మారి 2’ చిత్రంలో రెండు పాటలకు కొరియోగ్రఫీ చేశాను.

Comments

comments