Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

తాలిపేరు గేట్లు మూయరా?

Execution of officers in the project management

ఆందోళనలో రైతులు
ప్రాజెక్టు నిర్వాహణలో అధికారుల అలక్షం
ప్రాజెక్టు మరమ్మతులు త్వరిత గతిన పూర్తి చేసేలా చర్యలు

మన తెలంగాణ/చర్ల : జూన్ మాసంలో 3వ వారం వచ్చింది. కానీ తాలిపేరు ప్రాజెక్టు గేట్లు ఇప్పటి వరకు అధికారులు మూయలేదు. ప్రతీ రోజు ప్రాజెక్టు గేట్లు దించినట్లుగా మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. వాస్తవంగా క్షేత్ర స్థాయిలో మన తెలంగాణ తాలిపేరు ప్రాజెక్టు పరిశీలిస్తే అధికారుల నిర్లక్షం అడుగడుగునా కనిపిస్తుంది. ఏజెన్సీ అన్నదాతగా పేరున్న తాలిపేరు ప్రాజెక్టు ప్రాజెక్టుపైనే రైతన్నల ఆశలు. చత్తీస్‌ఘడ్‌లో కురిసిన కొద్దిపాటి వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టు నిండుకుంటుంది. కాని అధికారులు అన్ని గేట్లు తెరిచివుంచి నీటిని వృధాగా దిగువకు వదిలేస్తున్నారు. వర్షాలు పడితే అదృష్ణమే, ఒకవేళ వర్షపాతం తక్కువగా ఉంటే మాత్రం రైతులకు వచ్చే కష్టాలు అన్నీ ఇన్ని కావు. తాలిపేరు ప్రాజెక్టుకు చెందిన గేట్లకు గ్రీజు తదితర మరమ్మతులన్నీ వేసవి కాలంలో చేయాలి, కానీ ప్రాజెక్టు పై నిర్లక్ష దోరణితో ఉన్న ఇంజనీరింగ్ అధికారులు మాత్రం మరమ్మతులు వేసవి కాలంలో చేయకుండా జూన్ నెలలో చేయ టం వలన రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని తాలిపేరు ప్రాజెక్టుపై ఆధార పడిన రైతులు వాపోతున్నారు. చర్ల, దుమ్ముగూడెం మండలాలో సు మారు 25700 ఎకరాలకు నీరందించే తాలిపేరు ప్రాజెక్టుపై ప్రాజెక్టు అధికారులు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆయకట్టు రైతులు కలెక్టర్, ఐటిడిఎ పిఓలతోపాటు సంబందిత మంత్రికి పిర్యాదులు పంపారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రాజెక్టు మరమ్మతులు త్వరిత గతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Comments

comments