Home తాజా వార్తలు యువతిపై భూత వైద్యుడి అత్యాచారం

యువతిపై భూత వైద్యుడి అత్యాచారం

Rape

 

మనతెలంగాణ,హైదరాబాద్: ఇంట్లో దయ్యం ఉందని, క్షుద్ర పూజలు చేయాలని చెప్పిన భూతవైద్యుడు ఓ యువతిపై(19) అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం… ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోరబండకు చెందిన యువతి కుటుంబం, భూత వైద్యుడు ఆజాం కూడా వారి ఇంటికి సమీపంలో ఉంటున్నాడు. గత కొంత కాలం క్రితం మీ ఇంట్లో దయ్యం తిరుగుతోందని దానిని పారదోలకుంటే ప్రమాదమని చెప్పాడు. వెంటనే బీదర్ సమీపంలోని దర్గాను సందర్శించాలని చెప్పాడు.

యువతి కుటుంబ సభ్యులు, ఆజాం కూడా వారితో కలిసి బీదర్‌కు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత యువతి తల్లిదండ్రులను దూరంగా పంపించి, మాయమాటలు చెప్పి యువతిపై అత్యాచారం చేశాడు. తర్వాత అందరు కలిసి హైదరాబాద్‌కు వచ్చారు. కొద్ది రోజుల తర్వాత ఆజాం యువతి ఇంటికి వచ్చి కొన్ని మంత్రాలు చదువాలని చెప్పి యువతి తల్లిదండ్రులను ఇంటి బయట ఉండాల్సిందిగా కోరాడు. ఈ సమయంలో మళ్లీ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి ఈ విషయం తమ చుట్టాలకు చెప్పడంతో శనివారం ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆజాంపై ఫిర్యాదు చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించేందుకు యువతిని పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. నిందితుడిని ఆదివారం అరెస్టు చేసి జుడిషియల కస్టడికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

 

Exorcist raped to 19 year old girl in Borabanda