Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు

భూకంపనం సృష్టించిన ప్రయోగం

Hydrogen-bombసియోల్ : తమ ఆరవ అణు పరీక్షలలో భాగంగా ఉత్తర కొరియా ఆదివారం అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును ప్రయోగించింది. అమెరికా ఇతర దేశాలు హెచ్చరిస్తున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తమ అణు పరీక్షలు సాగిస్తూ వస్తున్నారు. ఆదివారం ఉత్తర కొరియాలోని ఈశాన్య ప్రాంతం సున్‌గ్జిబేగమ్‌లో ఈ హైడ్రోజన్ బాంబును పేల్చారు. ఇది పేలడంతో దేశంలోని పలు ప్రాంతాలలో భూమి రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో కంపించింది. ఈ భూకంప తీవ్రతను బట్టి ప్రయోగ నిర్వాహకులు హెడ్రోజన్ బాంబు సమర్థతను నిర్థారించుకున్నారు. ఉత్తర కొరియా అణు పరీక్షపై జపాన్, దక్షణి కొరియాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తమ దేశం రూపొందించిన హైడ్రోజన్ బాంబును దేశాధినేత కిమ్ జాంగ్ పరిశీలించి , పలు ఫోటోలు దిగి వచ్చిన కొద్ది సేపటికే అణు ప్రయోగంలో భాగంగా ఈ బాంబు పేల్చారు. ఈ అణు బాంబు ప్రయోగ తీవ్రతను దక్షిణ కొరియా వాతావరణ పరిశోధనా సంస్థ విశ్లేషించింది. ఈ పరీక్షతో పేలు తీవ్రతను కొలిచే 5౦ నుంచి 6౦ కిలోటాన్‌ల శక్తి ఉత్పన్నమైందని, గత ఏడాది సెప్టెంబర్‌లోనే ఉత్తర కొరి యా జరిపిన ఐదవ అణు పరీక్షతో పేలిస్తే ఇప్పుడు ఐదు నుంచ ఆరింతలు అధిక శక్తి ఉత్పన్నమైందని అంచనా వేశారు. తమ దేశం నుంచి అమెరికాలోని ఏ ప్రాంతాన్ని అయినా దెబ్బతీయగల సామర్థపు అణ్వాయుధ క్షిపణి తయారీ లక్షంతో ఉన్న ఉత్తరకొరియా ఈ పరీక్షతో ఆ పాటవానికి చేరువలోనే ఉన్నట్లు వెల్లడయింది. ప్రయో గం గురించి ఉత్తరకొరియా టీవీలలో ప్రముఖంగా వార్త లు అందించారు. పరీక్ష సంపూర్ణంగా విజయవంతం అయిందని, రెండు దశల థర్మోన్యూక్లియర్ ఆయుధం అత్యంత శక్తివంతం, అసాధారణ స్థాయితో ఉందని వ్యాఖ్యాతలు తెలిపారు. అంతకు ముందు కొన్ని గంటల క్రితమే తమ నేత ఖండాంతర దాడి పాటవ క్షిపణి వ్యవస్థకు అనువైన హైడ్రోజన్ బాంబును పరిశీలించారని ఉత్తరకొరియా అధికార వర్గాలు తెలిపాయి.
కిల్జ్‌లో కృత్రిమ భూకంపం : స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12ః29 గంటల ప్రాంతంలో ఉత్తర హామ్‌గ్యాంగ్ ప్రాంతంలోని కిల్జ్‌లో 5.7 తీవ్రతతో కృత్రిమ భూకంపం సంభవించిందని సియోల్ వాతావరణ శాఖ, సైనిక దళాల ప్రధానాధినేత తెలిపారు. ఈ ప్రాంతంలోనే ఉత్తరకొరియా ఇంతకు ముందు కూడా పరీక్షలు జరిపింది. ఉత్తర కొరియా అణు పరీక్షలపై అమెరికా విదేశాంగ శాఖ వెంటనే ఏమీ స్పందించలేదు. అయితే దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం వారు ఓ ప్రకటన వెలువరించారు. ఈ ప్రయోగంపై అధ్యక్షులు మూన్ జే ఇన్ అధ్యక్షతన అత్యవసరంగా జాతీయ భద్రతా మండలి సమావేశం ఉంటుందని తెలిపారు. అమెరికాతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ అన్ని విధాలుగా ఉత్తర కొరియా సవాలును ఎదుర్కొనేందుకు, అన్ని విధాలుగా సంసిద్ధతతో ఉంటామని దక్షిణ కొరియా సైనిక వర్గాలు తెలిపాయి. ఉ. కొరియా అణు పరీక్ష శక్తివంతంగా జరిగిందనే విషయాన్ని జపాన్ కూడా ధృవీకరించింది. విదేశాంగ మంత్రి టరో కోనో దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర కోరియా ఈ విధంగా అణు పరీక్షలు జరుపుతూ పోవడం ఆమోదయోగ్యం కాదని, దీనిపై ఖచ్చితంగా నిరసన తెలియచేయాల్సి ఉందని జపాన్ ప్రధాని షింజో అబే తెలిపారు. గత నెలలోనే ఉత్తర కొరియా అత్యంత శక్తివంతమైన అణు సామర్థ మధ్యస్థ తరహా క్షిపణిని జపాన్ మీదుగా ప్రయోగించింది.

Comments

comments