Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు : 10మంది మృతి

Explosion in Chemical Factory : 10 Workers died

బీజింగ్ : నైరుతి చైనాలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పది మంది కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 12మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

Explosion in Chemical Factory : 10 Workers died

Comments

comments