Home తాజా వార్తలు ఢిల్లీలో పేలుడు పదార్థాలు స్వాధీనం

ఢిల్లీలో పేలుడు పదార్థాలు స్వాధీనం

Explosive Material Seized in Delhi

ఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో దాడులకు చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర చేశారని నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో ఎన్‌ఐఎ అధికారులు ఢిల్లీలో తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఢిల్లీలో భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు పట్టుబడ్డాయి. ఢిల్లీలోని రెండు ప్రాంతాల్లో నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌ఐఎ అధికారులు తెలిపారు. కార్బైన్లు, కాట్రిడ్జ్‌లు, ఆయుధాలు, మందుగుండ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌ఐఎ అధికారులు తెలిపారు. బెంగళూరులో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు.

Explosive Material Seized in Delhi