Search
Friday 16 November 2018
  • :
  • :

విమానాల్లో అదనపు లగేజీకి ఛార్జీల వడ్డన

Extra charges for Luggage in Flights

న్యూఢిల్లీ: దేశీయ విమానాల్లో 15 కిలోల కంటే ఎక్కువ లగేజీని తీసుకెళ్లే పక్షంలో  ప్రైవేట్ విమాన సంస్థలు అదనపు లగేజీ ఛార్జీల కింద 33 శాతం పెంచేశాయి. ముందుగా బుక్ చేసుకోకుండా అదనపు లగేజీని తీసుకెళితే… 15 కిలోల  కంటే ఎక్కువుండే ప్రతి కిలోకు ప్రయాణికులు రూ. 400 చొప్పున అదనంగా చెల్లించాలి.  తక్కువ ధరకు విమానయాన సేవలందించే ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్ అధిక లగేజీకి ఛార్జీలు వడ్డించనున్నాయి. ఇండిగో ప్రీబుకింగ్ ఛార్జీలుగా 5 కిలోలకు రూ. 1900, 10 కిలోలకు  రూ. 3800, 15 కిలోలకు రూ. 5700, 30 కిలోలకు రూ. 11,400 నిర్ణయించింది. ఈ అదనపు వడ్డన శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. ఇండిగో, స్పైస్‌జెట్ తమ బ్యాగేజీ ధరలను శుక్రవారం(జూన్ 22న) సవరించగా, గోఎయిర్ శనివారం పెంచింది.  డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిఎ) ఉత్తర్వు ప్రకారం 15 కిలోలకు మించిన తొలి ఐదు కిలోలకు రూ. 500 మాత్రమే ఆగస్టు వరకు దేశీ విమాన సంస్థలు వసూలు చేస్తుండేవి.

కాగా 20 కిలోలకు మించిన లగేజీకి ఇష్టప్రకారం వసూలు చేసేవి. అయితే విమాన సంస్థలు కోర్టులో డిజిసిఎ ఉత్తర్వును సవాలు చేశాయి. దాంతో 15 కిలోలకు మించి తీసుకెళ్లే లగేజీకి అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు అనుమతించారు. ఇటీవల కాలంలో ఇండిగో ఇలా ధర పెంచడం ఇది రెండోసారి. పెరుగుతున్న విమాన ఇంధన ధర, రూపాయి విలువ పతనం కారణంగా ఇండిగో మే 30న దేశీ విమానాల్లో ఇంధన సర్‌ఛార్జీని ప్రవేశపెట్టింది. 1000 కిమీ. కన్నా తక్కువ దూరం ఉండే ప్రయాణాలకు రూ.200బాదడం మొదలెట్టింది. అదే 1000 కిమీ. కన్నా  ఎక్కువ దూరం ఉండే ప్రయాణాలకు రూ. 400 వడ్డించనారంభించింది. కింగ్‌ఫిషర్ విమాన సంస్థ గతే తమకు పట్టకూడదనే దృష్టానే దేశీ విమాన సంస్థలు ఛార్జీలు పెంచడం మొదలెట్టాయి. ‘మాకు ప్రత్యామ్నాయం ఏముంది కనుక?.. ఛార్జీలన్నా పెంచాలి లేదా సంస్థను మూసేసుకోవాలి’ అని విమానయాన సంస్థ అధికారి ఒకరు చెప్పారు.

Comments

comments