Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

వేములకొండ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ

 Extracional distribution to families of dead in Vemulakonda

వలిగొండః మండల పరిధిలోని వేములకొండ గ్రామంలో ఇటీవల ట్రాక్టర్ బోల్తా పడి దుర్ఘటనలో మృతి చెందిన 15 మంది కుటుంబాలకు ఒక్కొకరికి 2లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌రెడ్డి,యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర అనిత రామచంద్రం శనివారం వేములకొండ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాదిత కుటుంబాలకు అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని,ప్రతి ఒక్కరికి,అపధ్బందు పథకం,రెండు పడకల ఇండ్లను త్వరలో అందిస్తామని,మృతుల కుటుంబంలోని పెళ్ళికి ఎదిగిన అమ్మాయిలకు స్వంత నిధులతో పెళ్ళ ఖర్చులను అందిస్తానని,వారి పిల్లలకు అవకాశం ఉన్న రెషిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించి ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను కల్పిస్తామని,ఈ ప్రమాదంలో గాయ పడ్డవారిని పరమర్శించారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రవినాయక్,జిల్లా రెవిన్యూ అధికారి మహేందర్‌రెడ్డి,చౌటుప్పల్ ఆర్‌డివో సూరజ్‌కుమార్,జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ అమరేందర్,ఎంపిపి శ్రీరాముల నాగరాజు,జెడ్పీటీసీ మొగుళ్ళ శ్రీనివాస్,పిఏసియస్ చైర్మన్ వాకిటి అనంతరెడ్డి,స్థానిక సర్పంచ్ ఆకుల మంజుల,రామన్నపేట సిఐ శ్రీనివాస్,మధర్‌డైయిరి డైరక్టర్ శ్రీధర్‌రెడ్డి,జనార్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments