Home తాజా వార్తలు హెచ్‌ఐవి సోకిన పిల్లల్లో విపరీత పరిణామాలు

హెచ్‌ఐవి సోకిన పిల్లల్లో విపరీత పరిణామాలు

HIV

హెచ్‌ఐవి(హ్యూమన్ ఇమ్యునో డెఫిసియెన్సీ వైరస్)తో బాధపడే పిల్లలకు వారి నాడీ వ్యవస్థ అభివృద్ధి, గ్రహించే జ్ఞానంపై వ్యతిరేక ప్రభావాలు ఉంటాయని, కొత్త అధ్యయనం వెల్లడించింది. రాష్ట్రస్థాయి ఎంఆర్‌ఐ (మేగ్నెటిక్ రిసొనాన్స్ ఇమేజింగ్) లను విశ్లేషించిన తరువాత ఈ అధ్యయనాన్ని ఆన్‌లైన్ జర్నల్‌లో వెలువరించారు. హెచ్‌ఐవి పిల్లలకు తక్కువ స్థాయి న్యూరోసైకలాజికల్ పరీక్షలు చేయగా జ్ఞాపక శక్తి తగ్గడంతో పాటు మనసును లగ్నం చేసే స్థితి కూడా లోపించడం, కంటి చూపునకు సంబంధించి లోపాలు కూడా కనిపించినట్టు అధ్యయనం వెల్లడించింది. హెచ్‌ఐవితో బాధపడే పెద్దల్లో బుద్ధిపూర్వక తెలివితేటలు నశించడం సాధారణమే.

ఇదే సాధారణ పరిస్థితి డెమెన్షియాతో బాధపడే పెద్దల్లో కూడా కనిపిస్తుంది. జ్ఞాపక శక్తి లేదా ఆలోచించే నైపుణ్యం క్షీణించడం, మెదడు పనిచేసే విధానం దెబ్బతినడం ఉంటుంది. అయితే ఇదే ప్రభావం పిల్లల్లో కనిపించినట్టు కొత్త అధ్యయనం వివరించింది. ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతంలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోలు ప్రోగ్రాం కింద చికిత్స పొందిన 26 మంది హెఐవి పిల్లలను పరిశోధకులు అధ్యయనం చేశారు. అదే ప్రాంతంలో హెచ్‌ఐవి సోకని 20 మంది ఈపిల్లలను కూడా అధ్యయనం చేశారు. ఈ అధ్యయనాలు మెదడు లోని మార్పులను, చర్యలను ముందుగా తెలుసుకోడానికి ఉపయోగపడతాయని, సరైన చికిత్సలను చేయడానికి వీలవుతుందని పరిశోధకులు తెలిపారు.

హెచ్‌ఐవి వైరస్ వ్యాధి నిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. శరీరం లోని అన్ని అవయవాలకు సోకుతుంది. దాదాపు 60,000 మంది పిల్లలు హెచ్‌ఐవితో ప్రస్తుతం దేశంలో బాధపడుతున్నారు. యాంటీ రిట్రోవైరల్ థెరపీ చికిత్స పొందుతున్నారు. మంచి ఆహారం తీసుకోవడం, వందశాతం మందులు వాడడం,శారీరక శ్రమ ఇవన్నీ హెచ్‌ఐవిని తగ్గించడానికి దోహదపడతాయి.

Extreme Consequences for Children with HIV Infection

telangana latest news

-సైన్స్ విభాగం