Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కంటి వెలుగుకు రూ.106కోట్లు

ph

పాలన అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం
కంటి పరీక్షల కోసం ఐ క్యాంపులు త్వరలో ప్రారంభం

మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘కంటివెలుగు’ పథకానికి పరిపాలన అనుమతులు సోమవారం మంజూరయ్యాయి. ఈ పథకం అమలు కోసం రూ.106.84 కోట్లను మం జూరుచేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వా టాగా రూ.84.11 కోట్లను భరిస్తుండగా జాతీయ ఆరోగ్య మిషన్ కింద రూ.22.80 కోట్లను విడుదల చేస్తుందని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిధుల్లో 50%కేంద్రాల ఏర్పాటుతో పాటు యంత్ర సామాగ్రి పరికరాల కోసం వినియోగించాలని నిర్ణయించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోకి ప్రతీ ఒక్కరికి కంటి పరీక్షలను నిర్వహించేలా ప్రభు త్వం చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను పూర్తిచేసింది. త్వరలో పథకాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారు లు ఏర్పా ట్లు చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సం బంధించి విధి విధానాల రూపకల్పన కోసం నిర్దేశిస్తూ వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులను జారీచేసిం ది. సమగ్ర కంటి పరీక్షల కోసం ‘ఐ క్యాంపు’లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా రిఫ్రాక్షన్ ఎరర్స్, కాటరాక్ట్, ‘విటమిన్ ఎ’ లోపం, ‘ఐ ఇన్‌ఫెక్షన్’, గ్లకోమా, కార్నియల్ డిసార్డర్స్ తదితర సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ప్రతి క్యాంపుకూ ఒక మెడికల్ టీం పర్యవేక్షణ ఉంటుందని, ఇందులో ఒక మెడికల్ అధికారి, ఇద్దరు లేదా ముగ్గురు ఎంపిహెచ్‌ఎస్, ఒకరు లేదా ఇద్దరు అప్తమిస్టులు, ఇద్దరు లేదా ముగ్గురు ‘ఆశా’ వర్కర్లు ఒక డేటా ఎంట్రీ అపరేటర్ ఉంటారని తెలిపారు. ప్రతి క్యాంపుకు అవసరమైన యంత్ర సామాగ్రితో పాటు మందులు, ఇతర వస్తువులను సమకూర్చేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీలు, పట్టణ ప్రాంతాల్లోని ప్రతీ వార్డులో ఈ క్యాంపులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా మూడున్నర కోట్ల మందికి కంటి పరీక్షలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వీరికోసం 41,05,808 కంటి అద్దాలు, ప్రైమరీ కేర్ కోసం 77,768, సెకండరీ కేర్ కోసం 3,31,178, ధియేటరీ కేర్ కోసం 14,283 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు జీవోలో వివరించారు.

Comments

comments