Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

15 నుంచి కంటి వెలుగు

Eye light that operates free eye tests for all citizens

పంద్రాగస్టున మధ్యాహ్నం 2 గంటలకు ముహూర్తం 

గజ్వేల్ నుంచి ్రప్రారంభించనున్న ముఖ్యమంత్రి కెసిఆర్
మరో చోట నుంచి గవర్నర్ నరసింహన్ శ్రీకారం
3 కోట్ల 70 లక్షల మందికి కంటి పరీక్షలు లక్షం 

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ర్టంలోని పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆగస్టు 15న మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ర్ట వ్యాప్తంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించా రు. గజ్వేల్ నియోజకవర్గంలో తానే స్వయంగా కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు, రాష్ర్ట గవర్నర్ నరసింహన్‌ను కూడా ఒక ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరనున్నట్లు వెల్లడించారు. మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎం ఎల్ సిలు, ఇతర ప్రజా ప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని, రాష్ర్ట వ్యాప్తంగా అదే రోజున కార్యక్రమం ప్రారంభించాలని ఆదేశించారు. రాష్ర్టంలోని ప్రతీ ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులు అందివ్వాలని, ఉచితంగా ఆపరేషన్లు కూడా నిర్వహించాలని సిఎం ఆదేశించారు. ఈ కార్యక్రమానికి అవసరమై న సిబ్బందిని, వైద్య పరికరాలను, వాహనాలను, కళ్లద్దాలను, మందులను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమంపై సిఎం కె.చంద్రశేఖర్‌రావు శనివారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య (మొదటిపేజీ తరువాయి)
శాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఆరోగ్య శ్రీ సిఇఓ మాణిక్ రాజ్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, జాయింట్ డైరెక్టర్ మోతీలాల్, టిఎస్‌ఎండిసి ఎండి వేణుగోపాల్, సరోజిని కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ రవిందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
3.70 కోట్ల మందికి కంటి పరీక్షలు:“గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రాష్ర్టంలోని దాదాపు 3.70 కోట్ల మంది పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంత పెద్ద కార్యక్రమం గతంలో ఎవరూ ఎప్పుడూ చేయలేదు. రాష్ర్ట వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నందున అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అందరు ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వాములను చేయాలి. జిల్లా కలెక్టర్లు ప్రజా ప్రతినిధులందరితో సమావేశాలు నిర్వహించి, జిల్లా స్థాయిలో షెడ్యూల్ ను తయారు చేయాలి. క్షేత్ర స్థాయిలో కార్యక్రమ నిర్వహణపై సమీక్ష ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. అందరూ కంటి వైద్య శిబిరాలకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలి” అని సిఎం కెసిఆర్ వివరించారు.
కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను అధికారులు సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ర్ట వ్యాప్తంగా కంటి వెలుగు నిర్వహణ కోసం 799 బృందాలను ఏర్పాటు చేశామని, ప్రతీ బృందంలో ఒక ఎంబిబిఎస్ డాక్టర్, ఆప్తోమెట్రిస్ట్, ఎఎన్‌ఎం తదితరులు ఉంటారని, ఒక్కో వైద్య బృందం రోజుకు సగటున 250 మందికి పరీక్షలు నిర్వహిస్తుందని, ఐ డ్రాప్స్, మందులు సిద్ధం చేసుకున్నామని, 34 లక్షల కంటి అద్దాలు సిద్ధం చేసి జిల్లాలకు పంపుతున్నామని, అవసరమైన వారికి ఆపరేషన్లు నిర్వహించడానికి రాష్ర్టవ్యాప్తంగా 114 కంటి ఆసుపత్రులను గుర్తించినట్లు అధికారులు వివరించారు.
కంటి వెలుగు నిర్వహణపై సిఎం కెసిఆర్ పలు సూచనలు చేశారు
వర్షం వచ్చినా సరే కంటి పరీక్షలు నిరాటంకంగా నిర్వహించేందుకు వీలుగా గ్రామ స్థాయిలో పాఠశాల భవవాన్ని కానీ, మరేదైనా పక్కా భవనాన్ని కాని ఎంపిక చేసుకోవాలి.
1 కంటి పరీక్షల కోసం నియమించే సిబ్బంది వల్ల సాధారణ వైద్య సేవలకు ఆటంకం కలుగకూడదు.
2 కంటి పరీక్షల శిబిరంలో పనిచేయడానికి ఎంబిబిఎస్ పూర్తి చేసిన వైద్యుల సేవలను తాత్కాలిక పద్ధతిలో వినియోగించుకోవాలి.
3 వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వారిని వినియోగించవద్దు.
4 ఏ రోజు ఏ గ్రామంలో పరీక్షలు నిర్వహిస్తున్నారనే విషయం ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలి.
5 కంటి పరీక్షలపై అవగాహన కల్పించాలి. ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్ల సేవలు వినియోగించుకోవాలి.
6  స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలి.
7 కంటి పరీక్షల నిర్వహణలో భాగస్వాములు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ ప్రజా ప్రతినిధులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లేఖలు రాయాలి.
8 వైద్య శిబిరాల్లో పాల్గొనే సిబ్బందికి వారానికో రెండు రోజులు కచ్చితంగా సెలవులు ఇవ్వాలి.
9 సిబ్బంది రాకపోకలకు ప్రభుత్వ ఖర్చుతో వాహనాలు ఏర్పాటు చేయాలి.
10 గ్రామాల్లో సరైన వసతి ఉండే అవకాశం ఉండదు కాబట్టి సమీప పట్టణాల్లో వసతి ఏర్పాటు చేయాలి.
11 ప్రభుత్వ అతిథి గృహాలతో పాటు సింగరేణి, విద్యుత్ సంస్థల అతిథి గృహాలను వాడుకోవాలి.
12 ప్రైవేటు హోటళ్లలో కూడా బస ఏర్పాటు చేయాలి.
13 పేదలకు వైద్య సేవలు అందించే వైద్య సిబ్బంది భోజన, వసతి ఏర్పాట్లు బాగుండాలి.
14 దగ్గరి చూపు లోపం ఉన్న వారికి వెంటనే మందులు, రీడింగ్ గ్లాసెస్ అందించాలి.
15 ఇతరులకు డాక్టర్లు సూచించిన అద్దాలు పంపిణీ చేయాలి.
16 ఆపరేషన్లు అవసరమైన వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో దశల వారీగా ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా ఆపరేషన్లు చేయించాలి.

సరోజిని కంటి ఆసుపత్రికి కొత్త భవనం
హైదరాబాద్‌లోని సరోజిని కంటి ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించడంతో పాటు అన్ని రకాల ఆధునిక వసతులు కల్పించనున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటించారు. దీనికి కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సరోజిని కంటి ఆసుపత్రికి దేశ వ్యాప్తంగా మంచి పేరు, ప్రతిష్టలు ఉన్నాయని, దానికి తగినట్లు కొత్త భవనాలు నిర్మించి, రోగులకు వైద్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

బస్తీ దవాఖానాల సంఖ్య పెంచాలి
నగరంలో నిర్వహిస్తున్న బస్తీ దవాఖానాలు పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, వాటి సంఖ్యను మరింత పెంచాలని సిఎం కెసిఆర్ సూచించారు. ముఖ్యంగా పేదలు ఎక్కువగా నివసించే మురికి వాడల్లో ఎక్కువ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పేదలకు ఈ బస్తీ దవాఖానాలు ఎంతగానో మేలు చేస్తున్నాయని, రాష్ర్ట గవర్నర్ కూడా బస్తీ దవాఖానాలను సందర్శించి అభినందించారన్నారు. దశల వారీగా బస్తీ దవాఖానాల్లో రోగ నిర్ధారక పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Comments

comments