Home కరీంనగర్ ప్రభుత్వ భూములపై రియల్టర్ల కన్ను?

ప్రభుత్వ భూములపై రియల్టర్ల కన్ను?

Untitled-11రాయికల్: ప్రభుత్వ భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడింది. ప్రభుత్వ భూముల పక్కనే ఉన్న రైతుల ద్వారా తమ సాగు భూములతో ఆక్రమణలు చేపట్టి అట్టి భూముల్లో రియల్ దందాకు తెర లేపుతు న్నారు. రైతుల ద్వారా తక్కువ ధరలకు భూ ములు కొనుగోలు చేసి తర్వాత ఆ భూములను చదును చేసి ఫ్లాట్‌లుగా విభజిం చి ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారు. దాంతో భూముల ధరలకు రెక్కలు వస్తుండగా ప్రభుత్వ భూములు మాత్రం కనుమ రుగవుతున్నాయి. రాయికల్ మండలం ఇటి క్యాల రెవెన్యూ గ్రామ శివారులోని రామరా వుపల్లె గ్రామ ప్రభుత్వ భూములపై రియల్టర్ల కన్ను పడింది. ఈ గ్రామ శివారులో విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఇదే విషయాన్ని ఆ గ్రామ సర్పంచ్ దయ్యాల బీరమల్లయ్య సాక్షాత్తు ఇటీవల జరిగిన మండల సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ భూములను చాలా మంది ఆక్రమించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజాప్రతినిధి నెత్తి, నోరు మొత్తుకున్న అయినప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం అనుమా నాలకు తావిస్తుంది. రియల్టర్లు, ఆక్రమణ దారులకు రెవెన్యూ అధికారుల సహకారం ఉందనే ఆరోపణలకు బలం చేకూరేలా రామరావుపల్లె ఉదంతం కనబడుతుంది. గ్రామ శివారులో నీలం చెరువు ఉంది.ఈ చెరువు సమీపంలోని భూమి కబ్జాకు గురై చెరువు ఆనవాళ్లు కోల్పోతుంది. ఈ చెరువు నుంచి పంట పోలాల కోసం పాత కాలంలో తవ్విన ఒర్రె పక్కనున్న స్థలాన్ని రైతులు చాలా మంది ఆక్రమించుకున్నారు. దీనికి తోడు గ్రామ శివారులో 1448, 1400, 1478, 1505 తదితర సర్వేనంబర్లలోని విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఈ సర్వే నంబర్ల పరిధిలో దాదాపు 5 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రంతమవుతున్నా రెవెన్యూ అధికారులు ఈ వైపు దృష్టిసా రించడం లేదనే ఆరోపణలున్నాయి.రాజన్న ఒర్రె సమీపంలోనున్న 40 ఎకరాల్లో చాల భూమి ఆక్రమణలకు గురైంది. ప్రస్తుతం ఈ గ్రామ శివారు నుంచి డబుల్ రొడ్డు ఉంది. కోరుట్ల, మెట్‌పెల్లి, రాయికల్ గ్రామాలకు ఆర్టీసి బస్సుల రాకపోకలున్నాయి. ఇక్కడ గుంట భూమి ధర రూ.35 నుంచి రూ.50 వేల వరకు ఉంది. భూముల ధరలు పెరిగిన దృష్టా చాల మంది రైతులు రియల్టర్‌ల వలలో చిక్కి నష్టపోతున్నారు.
ఇక్కడ చాల మంది ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని దర్జాగా సాగు భూముల్లో కలుపుకుంటూ రియల్టర్‌లకు అమ్ముకుంటున్నారు. ఎకరా కు రూ.10 నుంచి రూ.20లక్షల దాక విలువైన భూములు అన్యాక్రాంతమై య్యాయి. ఈ గ్రామ శివారులోని చాల భూమి సాతారం గ్రామస్తుల కబ్జాలోకి వెళ్లి విలువైన భూములు ఆనవాళ్లు లేకుండా పోయాయని గ్రామస్తులు ఆవేదన చెందు తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ భూములను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం
చంద్రప్రకాష్, తహసీల్దార్, రాయికల్
మండలంలోని రామరావుపల్లె గ్రామ శివారులోని ప్రభుత్వ భూములు ఆక్ర మణకు గురైనట్లు తమ దృష్టికి వచ్చిందని విచారణ జరిపి తగు చర్యలు తీసు కుంటామని రాయికల్ తహసీల్దార్ చంద్రప్రకాష్ మన తెలంగాణకు తెలిపారు. క్షేత్రస్థాయికి వెళ్లి ప్రభుత్వ భూముల హద్దులను గుర్తిస్తామని ఎవరైనా ఆక్రమ ణలకు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు