Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

జులైలో సెట్స్‌పైకి మల్టీస్టారర్

f2

స్టార్ హీరో వెంకటేష్, యంగ్ స్టార్ వరుణ్‌తేజ్ కాంబినేషన్‌లో రూపొందనున్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనేది ట్యాగ్‌లైన్. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్వకత్వం వహించనున్న ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్‌తేజ్‌కు జంటగా మెహరీన్ నటించనున్నారు. కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడంలో మంచి పట్టు ఉన్న అనిల్ రావిపూడి ‘ఎఫ్ 2’ సినిమాను పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ దర్శకుడు పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ చిత్రం షూటింగ్ జూలైలో ప్రారంభంకానుంది. తొలిసారి వెంకటేష్, వరుణ్‌తేజ్ కలిసి నటించనున్న ఈ సినిమాను వరుస విజయాలతో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి ఏ విధంగా తెరకెక్కిస్తాడో చూడాలి.

Comments

comments