Home తాజా వార్తలు డిసెంబర్ 12న ‘ఎఫ్ 2’ టీజర్

డిసెంబర్ 12న ‘ఎఫ్ 2’ టీజర్

 

హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా తెరకెక్కుతున్న క్రేజీ మల్లీస్టారర్ ‘ఎఫ్ 2’. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ వంటి హైట్రిక్ విజయాలను అందించిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ డైరెక్టర్ ప్రతి సినిమా విజయంలోను కామెడీ ప్రధానమైన పాత్రను పోషించింది.

తాజాగా రూపొందుతున్న’ఎఫ్ 2′ సినిమాను కూడా కామెడీనే ప్రధాన కథాంశంగా ఎంచుకున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ సినిమా ప్రమోషన్ లో జోరు పెంచనుంది. ఇందులో భాగంగా డిసెంబర్ 12న ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు.’మల్లీశ్వరి’ తరువాత వెంకటేశ్ చేసిన పూర్తి వినోదభరిత చిత్రం ఇదేనని అంటున్నారు. ఇక ఈ తరహా సినిమా చేయడం వరుణ్ తేజ్ కి ఇదే మొదటిసారి. వెంకటేష్ తో పాటు కామెడీని పండించడంలో వరుణ్ తేజ్ మెప్పిస్తే ఇక తిరుగుండదని సినీ జనాలు చెప్పుకొంటున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతికి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

 

F2 movie teaser release on December 12th