Home టెక్ ట్రెండ్స్ ఫేస్‌బుక్ నుంచి కొత్త వీడియో యాప్‌…

ఫేస్‌బుక్ నుంచి కొత్త వీడియో యాప్‌…

Facebook

ముంబయి: ప్రముఖ సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ అయిన ఫేస్‌బుక్…. లాస్సో పేరిట తన కొత్త యాప్‌ను రిలీజ్ చేసింది. ఇందులో యూజర్లు తక్కువ సైజ్ కలిగిన వీడియోలను షేర్ చేయవచ్చు. అంతేకాకుండా వాటిని ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాలకు పంపే సదుపాయాన్ని కల్పించింది సంస్థ. స్నాప్‌చాట్ తరహాలో ఈ యాప్ పనిచేస్తుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఇందులో షార్ట్ ఫార్మాట్ వీడియోలను ఎడిట్ చేసుకోవడానికి పలు ప్రత్యేక ఫిల్టర్లు, స్పెషల్ ఎఫెక్ట్స్‌ను అందించారు. కాగా, ఈ యాప్ ప్రస్తుతం యుఎస్‌లోనే అందుబాటులోకి వచ్చింది. ఇతర దేశాల యూజర్లకు కోసం త్వరలోనే ఈ యాప్‌ను అందుబాటులోకి  తేనున్నారు. ఆండ్రాయిడ్, ఐఒఎస్ ప్లాట్‌ఫాంలపై ఈ యాప్ అందుబాటులోకి రానుంది.

Facebook ‘Lasso’ Short Form Video App Launched

telangana latest news