Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

10 లక్షల కోట్లు నష్టపోయిన ఫేస్‌బుక్!

Facebook lost $ 15 billion two hours

వాషింగ్టన్: సామాజిక మాద్యమాల్లో అందరు ఎక్కువగా వాడే మాద్యమం ఫేస్‌బుక్. అయితే దీని షేర్లు ఇప్పుడు దారుణంగా పడిపోతున్నాయి. గంటల వ్యవధిలో ఫేస్ బుక్ 24 శాతం మేర నష్టపోయిందంటే అతిశయోక్తి కాదు. కేవలం రెండు గంటల వ్యవధిలో ఫేస్‌బుక్ ఏకంగా 15 వేల కోట్ల డాలర్లు నష్టపోయింది. అంటే మన కరెన్సీతో పోల్చితే  సుమారు రూ. పది లక్షల కోట్లు నష్టపోయింది. సంస్థ సిిఇవొ మార్క్ జుకెర్‌బర్గ్ సంపద కూడా 1680 కోట్ల డాలర్లు అంటే సుమారు రూ.లక్షా 15 వేల కోట్లు నష్టపోయారు. జుకెర్ బర్గ్ తన ఆస్తిలో దాదాపు 5 వంతు కోల్పోవడం గమనార్హం.

ఫేస్‌బుక్ షేర్లు ఇలాగే గురువారం కూడా పతనమైతే బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో జుకెర్‌బర్గ్ 3 స్థానం నుంచి 6 స్థానానికి పడిపోతారని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ ప్రకటించింది. అదే కనుక జరిగితే జుకెర్‌బర్గ్ సంపద 7 వేల కోట్ల డాలర్ల కంటే తక్కువ అవుతుందని ఆ రిపోర్ట్ వెల్లడించింది. కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా స్కాంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్నఫేస్‌బుక్ లాభాలు సంవత్సరంలో 47 శాతం నుంచి 44 శాతానికి తగ్గిపోయాయి. గత 3 సంవత్సరాలలో ఫేస్‌బుక్‌కు ఇదే అతి తక్కువ వృద్ధిరేటు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఫేస్‌బుక్ లాభం 510 కోట్ల డాలర్లు. అంటే షేరుకు 1.74 డాలర్ల మేర లాభాలు సంపాదించింది. రోజువారీ ఫేస్‌బుక్ యూజర్ల సంఖ్య ప్రస్తుతం 147 కోట్లుగా ఉంది.

Comments

comments