Home తాజా వార్తలు ఫేస్ బుక్ ప్రేమ … పెళ్లి …మోసం

ఫేస్ బుక్ ప్రేమ … పెళ్లి …మోసం

Love

హైదరాబాద్ : ఫేస్‌బుక్ పరిచయం, ఆపై ప్రేమ… అనంతరం పెళ్లి . ఆ తరువాత తెలిసింది. పెళ్లి కొడుకు మోసం మాటలు చెప్పాడని. ఈ ఘటన ఎల్‌బినగర్ పరిధిలో జరిగింది. బైరామల్‌గూడకు చెందిన యువతి (24) బీటెక్ పూర్తి చేసింది. వైజాగ్‌లోని అరకు సమీపంలో నివసించే చద్రశేఖర్ (34) అనే యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఐదు నెలల్లోనే వారి పరిచయం ప్రేమగా మారింది.2015లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కట్నంతో పాటు నగలను సైతం పెట్టారు. తాను సింగపూర్ వెళుతున్నాని చెప్పాడు. నీకు కూడా వీసా ఇప్పిస్తానంటూ ఆమె ధ్రువపత్రాలు తీసుకెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడు. ఆమె ఒంటిపై ఉన్న నగలను సైతం అత్త తాకట్టు పెట్టింది.అతనికి వచ్చేది 20 వేల జీతమేనని తెలిసిన భార్య గొల్లుమంది. అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధిస్తుండడంతో బాధిత యువతి కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో ఎల్‌బినగర్ పోలీసులు చంద్రశేఖర్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.