Home అంతర్జాతీయ వార్తలు ఫేస్‌బుక్, ట్విట్టర్‌పై ఉ.కొరియా నిషేధం

ఫేస్‌బుక్, ట్విట్టర్‌పై ఉ.కొరియా నిషేధం

north-korea-facebook-and-twప్యాంగ్‌యాంగ్ : ఉత్తర కొరియా మరో తీవ్ర నిర్ణయం తీసుకుంది. దక్షిణ కొరియా వెబ్‌సైట్లతో పాటు సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ సైట్లను నిషేధిసున్నట్లు ప్రకటించింది. సోషల్‌మీ డియా ద్వారా ఆన్‌లైన్ సమాచారం విపరీతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అక్కడి ప్రభుత్వ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ కోర్యోలింక్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ పోస్ట్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ప్రకటన చేసింది. ఇప్పటికే ఉత్తర కొరియాలో ఇంటర్నెట్ సదుపాయం చాలా తక్కువగా. విదేశీయులకు మాత్రం గతం లో ఇంటర్నెట్‌పై నిబంధనలు ఉండేవి కావు. కొత్త ఆంక్షలతో వారికి కూ డా నిబంధనలు కఠినమయ్యాయి. కొంత కాలం వరకు ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ద.కొరియా మీడియా సైట్లు నిషేధిస్తున్నామని, అక్రమంగా ఉపయోగించే ప్రయత్నం చేయొద్దని ఉ.కొరియా హెచ్చరించింది.

మా జిపిఎస్‌ను ఉ.కొరియా దెబ్బ తీస్తోంది : దక్షిణ కొరియా
సియోల్ : ఇప్పటి వరకు క్షిపణి ప్రయోగాలతో పొరుగు దేశాలతో పాటు అమెరికాను రెచ్చగొడుగతూ వచ్చిన దక్షిణ కొరియా తాజాగా కొత్త పంథాను అనుసరిస్తోంది. సిగ్నల్స్‌ను జామ్ చేయడానికి ఉత్తర కొరియా రేడియో తరంగాలను ఉపయోగిస్తోందని దక్షిణ కొరియా శుక్రవారంనాడు ఆక్షేపించింది. దీంతో విమానాలకు, నౌకలకు ఇబ్బంది కలుగుతోందని దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అగ్రదేశాలతో సహా పలు దేశాలనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ఉత్తర కొరియా పలుమార్లు క్షిపణి ప్రయోగాలు చేస్తుండడంతో ఇప్పటికే ఉత్తర, దక్షిణ కొరియా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా గురువారం నుంచి ఉత్తర కొరియా తమ దేశంలో జిపిఎస్ సిగ్నల్స్ పనిచేయకుండా సరిహద్దులోని పలు కీలక ప్రాంతాల్లోకి జామింగ్ సిగ్నల్స్ పంపుతోందని దక్షిణ కొరియా రక్షణ శాఖ పేర్కొంది. దీని ప్రభావం ఇప్పటికే 58 విమానాలు, 52 నౌకలపై పడిందని.. ప్రయాణాలకు అంతరాయం ఏర్పడుతోందని తెలిపింది. ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని.. ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని దక్షిణ కొరియా రక్షణ శాఖ ఉత్తర కొరియాను కోరింది.