Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు కరువు

cpi

మన తెలంగాణ/ఆసిఫాబాద్‌టౌన్ : జిల్లా కేంద్రంలోని ఇటీవల నూతనం గా నిర్మించిన 50 పడకల ఆసుపత్రిలో సౌకర్యాలు కరువయ్యాయని భారత కమ్యూనిస్టు పార్టి జిల్లా కార్యదర్శి కూశన రాజన్న అన్నారు. సోమవార ం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం నూతనంగా 50 పడకల ఆసుపత్రిని ప్రారంభించిందని, కానీ రెగ్యూలర్ వైద్యులను భర్తీచేయలేకపోగా రోగులు ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. అనేక పోస్టుల ఖాలీగా ఉండడంతో ఆసుపత్రికి వ చ్చే రోగులు వారి వ్యాధులను పరిక్షించుకోవాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఎంబిబిఎస్ డాక్టర్‌లను ఇంచార్జిలుగా నియమిం చి జిల్లాలో గిరిజన దళిత జనాభా అధిక ఉన్నందున సరైన వైద్యం అందక చాలా మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణీలకు, పసిపిల్లకు, సిటీ స్కానింగ్‌లకు మిగితా వసతులు లేకపోవడంతో ఇ బ్బందులు ఎదుర్కొంటున్న దృష్టా అదికారులు, ప్రజా ప్రతినిదులు స్పం దించి రెగ్యూలర్ వైద్యులను నియమించి అన్ని సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు అల్లూరి లోకేష్, ముం జం శ్రీనివాస్, దుర్గం దిన్‌కర్, దుర్గం కార్తిక్, శ్రీనివాస్, తదితరులున్నారు.

Comments

comments