Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఆదమరిస్తే ప్రమాదమే..

facilities not sufficient in bikkanoor gurukula boys school

రాజంపేట్ ః బిక్కనూర్ మండలంలోని సాంఘీక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థుల గదుల్లో కరెంటు వైర్లు ప్రమాదంగా మారాయి. విద్యార్థులు మరచిపోయి స్వీచ్ పట్టుకుంటే ప్రమాదకరంగా ఉన్నాయి. కరెంట్ స్వీచ్‌లు ఊడిపోయాయి. బోర్డులు వేళాడుతున్నాయి. అంతే గాకుండా పరిశుభ్రత సైతం లోపిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. నీటి సౌకర్యం కూడా సరిగ్గాలేదని అనేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. పాఠశాలలో ఇంకుడు గుంత సైతం నామ మాత్రంగా వేసామా అంటే వేసినట్లుగా ఉంది. కనీసం మండలస్థాయి, జిల్లాస్థాయి అధికారులు, పాలకులు మాత్రం తనిఖీలు చేపట్టి పేద పిల్లలకు ఆశ్రయం అయిన గురుకుల పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Comments

comments