Home అంతర్జాతీయ వార్తలు క్షిపణుల ప్రయోగంలో ఉ.కొరియా మళ్లీ విఫలం?

క్షిపణుల ప్రయోగంలో ఉ.కొరియా మళ్లీ విఫలం?

missilesసియోల్: ఉత్తర కొరియా బుధవారంనాడు రెండు ఖండాంతర క్షిఫణులను ప్రయోగించిందని అమెరికా, దక్షిణ కొరియాకు చెందిన సైనికాధికారులు తెలిపారు. గత ఏప్రిల్ నెలనుంచి ఆ దేశం ఇటువంటి ప్రయోగానికి ప్రయత్నించడం ఇది ఐదవసారి. ఈ ఐదు ప్రయోగాలు విఫలమైనాయి. కొన్ని మధ్యలోనే పేలిపోగా కొన్ని పతనం చెంది మండిపోయాయి. ఒక ఆరవ ప్రయోగంలో మాత్రమే క్షిపణి 400 కిలోమీటర్లు ప్రయాణించినట్లు దక్షిణ కొరియా సైనిక సిబ్బంది అధికారులు తెలిపారు. 3500 కి.మీల దూరం ప్రయాణించగల ఖండాంతర క్షిపణి సామర్థాన్ని సంపాదించాలన్నది ఉత్తర కొరియా లక్షం. ఆ లక్షానికి చాలాదూరంలో ఆ దేశం ఉందని వారు చెప్పారు. పదేపదే విఫలమౌతున్నా ఉత్తర కొరియా ముసుగాన్ రకం మధ్యంతర క్షిఫణులను ప్రయో గించడం మానటం లేదు. ఇది అమెరికా, దాని మిత్రదేశాలకు ఆందోళన . జపాన్, దక్షిణ కొరియాలు ముఖ్యంగా ఆందోళ న చెందుతున్నాయి. ఎందుకంటే ఆ క్షిపణుల రేంజిలోకి పసిఫిక్ ఆసియా ప్రాంతా లలో చాలాభాగం వస్తాయి. ఈ ఏడాది మొదట్లో ఉత్తర కొరియా అణు పాటవ పరీక్ష జరిపింది. అది ఆ దేశానికి నాలుగవది. ఆ తరువాత సుదూరం ప్రయాణించగల రాకెట్‌ను ప్రయోగించింది. అయితే నిషిద్ధ క్షిపణి సాంకేతిక విజ్ఞానాన్ని సంపాదించడంపై గల నిషేధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రయోగాలు గురించి వేరే విధంగా ప్రచారం చేసినట్లు నిపుణులు భావించారు. బుధవారంనాడు ఉదయం ఓన్‌శాన్ నగరంనుంచి తెలిపిన క్షిపణి పరీక్ష విఫలమైందని దక్షిణ కొరియా ఉమ్మడి సిబ్బంది అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అసలు జరిగినదేమిటి? అనేది అమెరికా రక్షణ నిపుణులు బేరీజు వేస్తున్నట్లు కూడా తెలిసింది. హవాయ్‌లోని అమెరికా స్ట్రాటజిక్ కమాండ్ వారు రెండు ఉత్తర కొరియా ముసుదాన్ క్షిపణుల ప్రయోగాన్ని పసిగట్టారు. అవి జపాన్ సముద్రంలో పతనమైనట్లు చెబుతున్నారు.
అమెరికా ఖండన
వాషింగ్టన్: ఉ.కొరియా రెండు ఖండాంతర క్షిపణుల ప్రయోగించడాన్ని అమెరికా గట్టిగా ఖండించింది. జవాబుదారీతనం లేని రోగ్ దేశం విచ్చలవిడిగా తీసుకున్న చర్య ఇది అని విమర్శించింది.